Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Eliminator, DC vs SRH: ఒక్క ప్లేఆఫ్ మ్యాచ్‌ గెలవని ఢిల్లీ, గణాంకాలివే!

 IPL 2019: Eliminator, Delhi Capitals vs Sunrisers Hyderabad – Statistical Preview

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా బుధవారం విశాఖపట్నం వేదికగా జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తలపడనుంది. ఈ సీజన్‌లో మొత్తం 14 మ్యాచ్‌లాడిన ఢిల్లీ క్యాపిటల్స్ తొమ్మిది విజయాలతో 18 పాయింట్లు సాధించి పట్టికలో మూడో స్థానంలో నిలిచింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఢిల్లీ గెలిచిన ప్లేఆఫ్ మ్యాచ్‌లు

ఢిల్లీ గెలిచిన ప్లేఆఫ్ మ్యాచ్‌లు

0 - ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు గెలిచిన ప్లేఆఫ్ మ్యాచ్‌లు. 2008, 2009 సీజన్లలో సెమీ పైనల్స్‌లో ఓడగా.... 2012 సీజన్‌లో మాత్రం ప్లేఆఫ్స్ వరకు చేరుకుంది.

3 - సన్‌రైజర్స్ హైదరాబాద్ విశాఖపట్నం స్టేడియంలో ఆడిన చివరి మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. తక్కువ మొత్తాలను నిలబెట్టుకుంది. విశాఖ స్టేడియంలో ఇప్పటివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ మొత్తం ఐదు మ్యాచ్‌లాడగా మూడింట విజయం సాధించి, రెండు మ్యాచ్‌ల్లో ఓడింది.

38 వికెట్లు తీసిన రషీద్ ఖాన్

38 వికెట్లు తీసిన రషీద్ ఖాన్

38 - 2019లో రషీద్ ఖాన్ మొత్తం 27 టీ20 మ్యాచ్‌లాడి 38 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. శ్రేయాస్ గోపాల్ వాహబ్ రియాజ్, మరో సన్‌రైజర్స్ ఆటగాడు ఖలీల్ అహ్మద్ 33 వికెట్లు తీసి రెండో స్థానంలో కొనసాగుతున్నారు.

42.75 - ఢిల్లీ క్యాపిటల్స్(గత సీజన్లలో పేరు - ఢిల్లీ డేర్ డెవిల్స్) జట్టుపై ఐపీఎల్‌లో మనీష్ పాండే బ్యాటింగ్ యావరేజి 42.75గా ఉంది. ఈ 12 సీజన్లలో మనీష్ పాండే మొత్తం 342 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

ఢిల్లీపై భువీ యావరేజి 47.88

ఢిల్లీపై భువీ యావరేజి 47.88

47.88 - ఢిల్లీ ప్రాంఛైజీపై సన్‌రైజర్స్ హైదరాబాద్ టాప్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ యావరేజి 47.88. ఢిల్లీపై ఆడిన 14 మ్యాచ్‌ల్లో భువీ మొత్తం 9 వికెట్లు పడగొట్టాడు.

50.83 - విశాఖ స్టేడియంలో ఢిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్ బ్యాటింగ్ యావరేజి 50.83. ఈ స్టేడియంలో ధావన్ మొత్తం 8 ఇన్నింగ్స్ ఆడి 305 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

926 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్

926 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్

154.14 - ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై రిషబ్ పంత్ స్ట్రయిక్ రేట్. సన్‌రైజర్స్‌పై మొత్తం 8 ఇన్నింగ్స్ ఆడి 46.5 యావరేజితో 279 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉంది. మరోవైపు ఢిల్లీ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సన్‌రైజర్స్‌పై మెరుగైన రికార్డుని కలిగి ఉన్నాడు.

926 - 2019 టీ20ల్లో శ్రేయాస్ అయ్యర్ 926 పరుగులు చేశాడు. ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో షేన్ వాట్సన్(953) తర్వాత శ్రేయాస్ అయ్యర్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మొత్తం 24 ఇన్నింగ్స్ ఆడిన అయ్యర్ 44.09 యావరేజితో ఈ పరుగులు సాధించాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు, రెండు సెంచరీలు కూడా ఉన్నాయి.

Story first published: Wednesday, May 8, 2019, 17:32 [IST]
Other articles published on May 8, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+