For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

DC vs SRH మ్యాచ్‌లో నమోదైన గణాంకాలివే:

IPL 2019: Eliminator, DC vs SRH Match Statistical Highlights

హైదరాబాద్: విశాఖ వేదికగా బుధవారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చివరివరకు ఉత్కంఠ భరితంగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించి సంగతి తెలిసిందే. లీగ్ స్టేజిలో కేవలం 12 పాయింట్లతో మెరుగైన రన్‌రేట్‌ను కలిగి ఉండటంతో ప్లేఆఫ్స్‌‌కు అర్హత సాధించిన సన్‌రైజర్స్ ఈ మ్యాచ్‌లో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం


కాగా, ఐపీఎల్ చరిత్రలోనే ఢిల్లీ క్యాపిటల్స్(గతంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్) ప్లేఆఫ్స్ మ్యాచ్ గెలవడం ఇదే తొలిసారి. 2012 ఐపీఎల్ సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు చేరుకోవడమే ఇప్పటివరకు ఆ జట్టు అత్యుత్తమ ప్రదర్శన. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ శుక్రవారం ఇదే స్టేడియంలో జరగనున్న క్వాలిఫయిర్ 2 మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది.

ప్లేఆఫ్స్ మ్యాచ్ గెలవడం ఇదే తొలిసారి

ప్లేఆఫ్స్ మ్యాచ్ గెలవడం ఇదే తొలిసారి

1 - ఐపీఎల్ చరిత్రలోనే ఢిల్లీ క్యాపిటల్స్(గతంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్) ప్లేఆఫ్స్ మ్యాచ్ గెలవడం ఇదే తొలిసారి. 2012 ఐపీఎల్ సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు చేరుకోవడమే ఇప్పటివరకు ఆ జట్టు అత్యుత్తమ ప్రదర్శన.

2 - ఐపీఎల్‌ చరిత్రలో అమిత్ మిశ్రా 'అబ్‌స్ట్రక్టింగ్‌ ద ఫీల్డ్‌' ద్వారా ఔటైన రెండో ఆటగాడిగా నిలిచాడు. కాగా, 'అబ్‌స్ట్రక్టింగ్‌ ద ఫీల్డ్‌' కింద ఔటైన ఫస్ట్ ప్లేయర్‌గా యూసఫ్ పఠాన్ నిలిచాడు. 2013 ఐపీఎల్ సీజన్‌లో యూసఫ్ పఠాన్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ఆడిన సమయంలో రాంచీ వేదికగా పూణె వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యూసఫ్ పఠాన్ కూడా ఇలానే పెవిలియన్‌కు చేరాడు.

ఐపీఎల్‌లో షా చేసిన సెంచరీలు

ఐపీఎల్‌లో షా చేసిన సెంచరీలు

4 - ఐపీఎల్‌లో పృథ్వీ షా చేసిన హాఫ్ సెంచరీలు. దీంతో టీనేజర్స్‌లో ఐపీఎల్ అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో శుభమాన్ గిల్ రికార్డుని షా సమం చేశాడు. ఈ జాబితాలో మూడు హాఫ్ సెంచరీలతో సంజూ శాంసన్(రాజస్థాన్ రాయల్స్), రిషబ్ పంత్(ఢిల్లీ క్యాపిటల్స్), ఇషాన్ కిషన్(ముంబై ఇండియన్స్) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

9 - ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడిన మ్యాచ్‌లు. సన్‌రైజర్స్ హైదరాబాద్ అత్యధిక మ్యాచ్‌లు ఓడిన సీజన్ ఇదే కావడం విశేషం. 2014 ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ అత్యధింకగా 8 మ్యాచ్‌ల్లో ఓడింది. ఇదే ఇప్పటివరకు అత్యధికం.

బసిల్ థంపి బౌలింగ్ ఎకానమీ 9.7

బసిల్ థంపి బౌలింగ్ ఎకానమీ 9.7

9.7 - బసిల్ థంపి బౌలింగ్ ఎకానమీ రేట్ ఇది. ఓ ఐపీఎల్ సీజన్‌లో 300 లేదా అంతకంటే తక్కువ బంతులు విసిరిన బౌలర్లలో ఇది చెత్త రికార్డు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో 19 మ్యాచ్‌లాడిన బసిల్ థంపి 40.5 యావరేజితో 16 వికెట్లు పడగొట్టాడు.

3 - ఈ సీజన్‌లో రషీద్ ఖాన్ మూడు సార్లు డకౌటయ్యాడు. ఐపీఎల్ సీజన్‌లో ఓ సన్‌రైజర్స్ ప్లేయర్‌కు ఇదే అత్యధికం. 2018 సీజన్‌లో ఇద్దరు సన్‌రైజర్స్ ఆటగాళ్లు రెండు సార్లు డకౌటయ్యారు.

మూడో ఆటగాడిగా ధావన్

మూడో ఆటగాడిగా ధావన్

ధావన్ @500 - ఈ సీజన్‌లో శిఖర్ ధావన్ చేసిన పరుగులు 503. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరుపున ఓ సీజన్‌లో అత్యధిక పరుగులు నమోదు చేసిన మూడో ఆటగాడు. 2018 ఐపీఎల్ సీజన్లో రిషబ్ పంత్ 684 పరుగులతో ఢిల్లీ జట్టు తరుపున అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 2008 సీజన్‌లో గంభీర్ 534 పరుగులు చేశాడు.

Story first published: Thursday, May 9, 2019, 16:03 [IST]
Other articles published on May 9, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+