IPL 2019, Eliminator, DC vs SRH: హెడ్ టు హెడ్ రికార్డులివే

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా బుధవారం జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కి విశాఖపట్నంలోని డా. వైఎస్ రాజశేఖరరెడ్డి క్రికెట్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇరు జట్ల విశాఖకు చేరుకున్నాయి.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఈ సీజన్‌లో 18 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి ఏడేళ్ల తర్వాత ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించగా... లీగ్ స్టేజిలో జరిగిన చివరి మ్యాచ్‌లో ముంబై చేతిలో కోల్‌కతా ఓటమి పాలవ్వడంతో కేవలం 12 పాయింట్లతోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. కాగా, విశాఖ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఒకే ఒక్క మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నెగ్గింది. ఇక, ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు తలపడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ గెలవగా.. మరొక మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధించి ప్రతీకారాన్ని తీర్చుకుంది. విశాఖ వేదికగా జరగనున్న మ్యాచ్‌లో ఎవరు నెగ్గితే ఆ జట్టు క్వాలిఫైయింగ్ మ్యాచ్‌కు అర్హత సాధిస్తుంది.
ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య గణాంకాలను ఒక్కసారి పరిశీలిద్దాం....

DC vs SRH మ్యాచ్ డిటేల్స్
తేదీ: బుధవారం, 8 May 2019
సమయం: 7:30 PM IST
వేదిక: Dr. YS Rajasekhara Reddy Cricket Stadium, Visakhapatnam
లైవ్ టెలికాస్ట్: స్టార్ నెట్‌వర్క్
ఆన్‌లైన్ స్ట్రీమింగ్: హాట్ స్టార్

హెడ్ టు హెడ్ రికార్డు
Total - 14
SRH - 9
DC - 5
విశాఖలో హెడ్ టు హెడ్ రికార్డు
Total - 1
SRH - 0
DC - 1

విశాఖ స్టేడియం హైలెట్స్
ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే గెలిచినవి - 22
ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటే గెలిచినవి - 34
ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజి - 156
రెండో ఇన్నింగ్స్ యావరేజి - 148

కీలక ఆటగాళ్లు
ఢిల్లీ క్యాపిటల్స్
శిఖర్ ధావన్, రిషబ్ పంత్, అమిత్ మిశ్రా
సన్‌రైజర్స్ హైదరాబాద్
మార్టిన్ గుప్టిల్
మనీష్ పాండే
రషీద్ ఖాన్

జట్ల వివరాలు
ఢిల్లీ క్యాపిటల్స్
పృథ్వీషా, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, కొలిన్ ఇన్‌గ్రామ్, రూథర్‌ఫర్డ్, అక్షర పటేల్, కీమో పాల్, ట్రెంట్ బౌల్డ్, అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ
సన్‌రైజర్స్ హైదరాబాద్
మార్టిన్ గుప్టిల్, సాహా, మనీష్ పాండే, విలియమ్సన్, విజయ్ శంకర్, యూసఫ్ పఠాన్, నబీ, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications