Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Eliminator: DC VS SRH: టాస్ గెలిచిన ఢిల్లీ, గెలిస్తే ముందుకు, ఓడితే నిష్క్రమణ

IPL 2019: Eliminator: DC VS SRH: Delhi Capitals win the toss and elect to field

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. విశాఖఫట్నం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ మ్యాచ్‌లో ఇరుజట్లు ఒక్కో మార్పుతో బరిలోకి దిగుతున్నాయి. ఢిల్లీ జట్టులో కొలిన్‌ ఇంగ్రామ్‌ స్థానంలో కొలిన్‌ మన్రో తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. మరోవైపు సన్‌రైజర్స్ తుది జట్టులో ఈ సీజన్‌లో వరుసగా విఫలమవతుతున్న యూసఫ్‌ ఫఠాన్‌ స్థానంలో దీపక్‌ హుడాకు చోటు కల్పించింది.

ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుండగా... నెగ్గిన జట్టు శుక్రవారం ఇదే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరగనున్న రెండో క్వాలిఫయిర్ మ్యాచ్‌లో తలపడనుంది. ఈ సీజన్‌లో మొత్తం 14 మ్యాచ్‌లాడిన ఢిల్లీ క్యాపిటల్స్ తొమ్మిది విజయాలతో 18 పాయింట్లు సాధించి పట్టికలో మూడో స్థానంలో నిలిచింది.

మరోవైపు సన్‌రైజర్స్ కేవలం ఆరు మ్యాచ్‌ల్లోనే విజయం సాధించి 12 పాయింట్లతో అదృష్టం కొద్దీ నాలుగో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్కసారి కూడా ప్లేఆఫ్స్‌లో విజయం సాధించలేదు. దీంతో ఈ మ్యాచ్‌ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

కాగా, ఈ మ్యాచ్‌లో ఢిల్లీ పేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. విశాఖ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఒకే ఒక్క మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నెగ్గింది. ఇక, ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు తలపడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ గెలవగా.. మరొక మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధించి ప్రతీకారాన్ని తీర్చుకుంది.

1
45947

జట్ల వివరాలు
ఢిల్లీ క్యాపిటల్స్
పృథ్వీషా, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, కొలిన్ మున్రో, రూథర్‌ఫర్డ్, అక్షర పటేల్, కీమో పాల్, ట్రెంట్ బౌల్డ్, అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ

సన్‌రైజర్స్ హైదరాబాద్
మార్టిన్ గుప్టిల్, సాహా, మనీష్ పాండే, విలియమ్సన్, విజయ్ శంకర్, దీపక్ హుడా, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, బసిల్ థంపి

Story first published: Wednesday, May 8, 2019, 19:17 [IST]
Other articles published on May 8, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+