Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆమె ఐపీఎల్ విజేతకు ట్రోఫీ ఇవ్వాలనుకున్నారు...

IPL 2019: Diana Edulji wanted to give away IPL 2019 winners’ trophy but eventually convention followed

బీసీసీఐ పరిపాలకుల కమిటీ (సీఓఏ) సభ్యులు డయానా ఎదుల్జీ ఐపీఎల్‌-12 విజేతకు ట్రోఫీ ఇవ్వాలనుకుంది. ఈ విషయం దాదాపు వివాదం దాకా వెళ్లింది. అయితే బీసీసీఐ అధ్యక్షుడు సీకే ఖన్నా ముంబై ఇండియన్స్ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు ట్రోఫీని అందించడంతో వివాదం సద్దుమణిగింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

ఐపీఎల్‌-12 ఫైనల్ మ్యాచ్‌కు బీసీసీఐ అధ్యక్షుడు సీకే ఖన్నా హాజరయ్యాడు. మరోవైపు పరిపాలకుల కమిటీ (సీఓఏ) సభ్యులు ఎదుల్జీ, రవి తొగ్డె హాజరు కాగా.. సీఓఏ అధినేత వినోద్‌ రాయ్‌ మాత్రం హాజరుకాలేదు. జైపుర్‌లో మహిళల టీ20 ఛాలెంజ్‌ ట్రోఫీని విజేతకు ఎదుల్జీ అందించారు. ఐపీఎల్‌-12 ట్రోఫీని కూడా విజేతకు అందించాలని కోరుకున్నారు.

ఈ విషయంపై రాయ్‌ అభిప్రాయాన్ని కోరారు. 'సంప్రదాయాన్ని మార్చడం అవసరమా' అని ప్రశ్నించాడు. దీంతో ఎదుల్జీ అసంతృప్తికి లోనైంది. ఇక ఎక్కువ మంది అభిప్రాయం కూడా ఆమెకు అనుకూలంగా లేకపోవడంతో తన ఆశను వదిలేసుకుంది. ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు సీకే ఖన్నా ట్రోఫీని అందించాడు. కప్ ఇవ్వకున్నా.. వేరే అవార్డులు ఇచ్చి డయానా సంతోషపడింది. చాలా విషయాల్లో కూడా వినోద్‌ రాయ్‌, డయానా ఎదుల్జీలకు మధ్య వివాదాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

Story first published: Tuesday, May 14, 2019, 18:07 [IST]
Other articles published on May 14, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+