న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2019: ధోని రివ్యూ సిస్టమ్ మళ్లీ సక్సెస్ - ట్విట్టర్‌లో ప్రశంసలు

IPL 2019: MS Dhoni Takes Last Second DRS In Chennai Super Kings Vs Royal Challengers Bangalore Match
IPL 2019: Dhoni Review System- MS Dhoni takes last second DRS in CSK vs RCB match, Twitter loses its collective mind

హైదరాబాద్: చెపాక్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో శనివారం రాత్రి జరిగిన ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని తన టైమింగ్‌తో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. వికెట్ల వెనుక సెకన్ల వ్యవధిలో బెయిల్స్‌ను గీరాటేసే ధోని.. తాజాగా డీఆర్‌ఎస్ విషయంలోనూ సెకన్‌ టైమింగ్‌ని ఫాలో అవడం విశేషం.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఇన్నింగ్స్‌ 12వ ఓవర్ వేసిన చెన్నై స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్‌లో బెంగళూరు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ నవదీప్ షైన్ బంతిని డిఫెన్స్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే, అనూహ్యంగా టర్న్ తీసుకున్న బంతి.. తొలుత అతని బ్యాట్‌ అంచు తాకి.. అనంతరం ఫ్యాడ్స్‌ను ముద్దాడుతూ వెళ్లి వాట్సన్ చేతుల్లో పడింది.

దీంతో ఎల్బీ కోసం చెన్నై జట్టు అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ దానిని తిరస్కరించాడు. బంతి వికెట్లకి తాకేలా వెళ్లలేదని అంపైర్ భ్రమించాడు. దీంతో డీఆర్ఎస్‌కు వెళ్లేందుకు బౌలర్ తాహిర్‌తో మాట్లాడిన ధోనీ డీఆర్‌ఎస్ కోరేలా కనిపించలేదు. మరోవైపు.. స్టేడియంలోని పెద్ద స్కీన్లపై డీఆర్‌ఎస్ టైమ్ కౌంట్‌డౌన్ కనిపించింది.

(బంతి డెడ్ అయిన 15 సెకన్లలోపే డీఆర్‌ఎస్ అడగాలనేది ఐసీసీ నిబంధన) దీంతో ఆఖరి సెకనులో ధోనీ అనూహ్యంగా డీఆర్‌ఎస్ అడిగి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అప్పటి వరకూ ధోనీని గమనిస్తూ వచ్చిన ఫీల్డ్ అంపైర్ ఇక చూపు మరల్చుకుంటున్న దశలో ధోని అతనికి షాకిచ్చాడు.

రిప్లైలో బంతి బ్యాట్‌కి తాకి స్లిప్‌లో నేరుగా షేన్‌వాట్సన్‌ చేతుల్లోకి వెళ్లినట్లు కనిపించడంతో అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకుని నవదీప్ షైనీని ఔట్‌గా ప్రకటించాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Story first published: Sunday, March 24, 2019, 15:41 [IST]
Other articles published on Mar 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X