నా హెలికాప్టర్ షాట్ వర్సన్‌పై ధోని రూమ్‌కి వెళ్లి మరీ అడిగా: హార్ధిక్ పాండ్యా

హైదరాబాద్: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి తన వర్షన్ హెలికాప్టర్ షాట్ అంటే ఇష్టమని ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో హార్ధిక్ పాండ్యా అద్భుత ప్రదర్శన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ సీజన్‌లో 9 మ్యాచ్‌లాడిన హార్ధిక్ పాండ్యా 194.64 స్ట్రయిక్ రేట్‌తో 218 పరుగులు చేశాడు. దీంతో పాటు 8 వికెట్లు తీసి ముంబై ఇండియన్స్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

15 బంతుల్లో 32 పరుగులు
తాజాగా గురువారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పాండ్యా 15 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 32 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు కృనాల్ పాండ్యా 26 బంతుల్లో 37(5 ఫోర్లు) కూడా రాణించడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవరల్లో 5 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. అనంతరం 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 128 పరుగులకే పరిమితమైంది.
40 పరుగుల తేడాతో ముంబై విజయం
దీంతో ముంబై ఇండియన్స్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సీజన్‌లో పాండ్యాకు ఇది రెండో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రబడా వేసిన చివరి ఓవర్‌లో హెలికాప్టర్ షాట్ ఆడిన పాండ్యా దానిని సిక్సర్‌గా మలిచాడు.

హార్ధిక్ పాండ్యా మాట్లాడుతూ
దీనిపై మ్యాచ్ అనంతరం హార్ధిక్ పాండ్యా మాట్లాడుతూ "ఈ గేమ్‌లో హెలికాప్టర్ షాట్ ఆడతానని అనుకోలేదు. కేవలం నెట్స్‌లో మాత్రమే ప్రాక్టీస్ చేసేవాడిని. ధోని రూమ్‌లోకి వెళ్లి నా హెలికాప్టర్ షాట్ వర్సన్ అంటే ఇష్టమేనా? అని అడిగా. ఇందుకు ధోని బాగుందని సమాధామనిచ్చాడు" అని పాండ్యా చెప్పుకొచ్చాడు.

ఎప్పుడు సిక్స్ కొట్టినా
"ఎప్పుడు సిక్స్ కొట్టినా బంతిని ఇంకా బలంగా కొట్టాల్సింది.. అని నాకు నేను చెప్పుకొంటూ ఉంటా. నెట్స్‌లో తీవ్రంగా సాధన చేయడం వల్లే ఎక్కువ సిక్సులు కొట్టగలుగుతున్నా. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నా. డెత్ ఓవర్లలో కూడా బేసిక్స్‌ను ఫాలో అవుతున్నా. అందుకు బంతిని బలంగా బాదగలుగుతున్నా" అని పాండ్యా అన్నాడు.

పిచ్‌తో పాటు బంతిని సరిగ్గా అంచనా వేస్తున్నా
"నా మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఈ సీజన్‌లో పిచ్‌తో పాటు బంతిని సరిగ్గా అంచనా వేస్తున్నా. ప్లే ఆఫ్స్‌కు చేరుకునేందుకు మాకు ఇంకా ఐదు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. సీజన్ మొత్తం ఇదే ఫామ్ కొనసాగిస్తానని అనుకుంటున్నా" అని హార్ధిక్ పాండ్యా తెలిపాడు. తాజా విజయంతో ముంబై పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications