Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓటమి.. కన్నీళ్లు పెట్టుకున్న కోచ్‌

IPL 2019 : Tom Moody Cries Profusely After Sunrisers Hyderabad’s Loss | Oneindia Telugu
IPl 2019, DC vs SRH: Tom Moody Cries After Sunrisers Hyderabad Loss against Delhi Capitals

ఐపీఎల్-12లో భాగంగా బుధవారం రాత్రి విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ చీఫ్ కోచ్‌ టామ్‌ మూడీ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఢిల్లీ గెలవాలంటే 6 ఓవర్లలో 52 పరుగులు చేయాలి. 15వ ఓవర్లో రషీద్‌ ఖాన్‌ ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మన్రో, అక్షర్‌ పటేల్‌ (0)ను ఔట్‌ చేసాడు.

దీంతో మ్యాచ్ సన్‌రైజర్స్ వైపు మొగ్గింది. ఇక ఢిల్లీ చివరి 3 ఓవర్లలో 34 పరుగులు చేయాలి. సన్‌రైజర్స్ బౌలర్ బాసిల్ థంపి వేసిన 18వ ఓవర్లో పంత్‌ వరుసగా 4, 6, 4, 6 బాది ఢిల్లీని విజయానికి దగ్గర చేసాడు. పంత్‌ (49; 21 బంతుల్లో 2×4, 5×6) మెరుపులతో.. ఢిల్లీ సమీకరణం 12 బంతుల్లో 12 పరుగులుగా మారింది. ఒక్కసారిగా మ్యాచ్ ఢిల్లీ వైపు మొగ్గింది. 20వ ఓవర్ ఐదవ బంతికి పాల్ ఫోర్ బాది ఢిల్లీకి విజయాన్ని అందించాడు.

అయితే 18వ ఓవర్‌ పూర్తయ్యాక మ్యాచ్‌ చేజారిపోతున్న విషయాన్ని తెలుసుకున్న సన్‌రైజర్స్ కోచ్‌ టామ్‌ మూడీ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టాకున్నారు. మరోవైపు సన్‌రైజర్స్ ఆటగాళ్లు అందరూ కూడా అసహనానికి గురయ్యారు. ముఖ్యంగా కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ భావోద్వేగానికి గురయ్యాడు. మూడీకి సబంధించిన వీడియో ఓ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్తా నెట్టింట్లో వైరల్‌గా మారింది. 'సన్‌రైజర్స్ టైటిల్‌ గెలవకపోవచ్చు.. కానీ అందరి మనసు గెలిచిందిని' సన్‌రైజర్స్ అభిమానులు మద్దతుగా నిలిచారు.

Story first published: Thursday, May 9, 2019, 13:02 [IST]
Other articles published on May 9, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+