న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మిశ్రా అబ్‌స్ట్రక్టింగ్‌ ద ఫీల్డ్‌ .. బెస్ట్ బ్యాట్స్‌మన్‌ అంటూ ట్విట్టర్లో జోకులు

IPL 2019,Eliminator : 'Amit Mishra Is The Best Batsman Of India' Netigens Trolled In Twitter
IPl 2019, DC vs SRH: Indias Best Batsmen Twitter Trolls Amit Mishra After Run Out

ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అమిత్ మిశ్రా ఒక్కసారిగా స్టార్ అయ్యాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా మిశ్రా గురించే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. విశాఖ వేదికగా బుధవారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో మిశ్రా 'అబ్‌స్ట్రక్టింగ్‌ ద ఫీల్డ్‌' ద్వారా ఔట్ అయ్యాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అమిత్ మిశ్రా 'అబ్‌స్ట్రక్టింగ్‌ ద ఫీల్డ్‌' ద్వారా ఔటైన రెండో ఆటగాడిగా నిలిచాడు.

3 బంతుల్లో 2 పరుగులు:

విశాఖలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. అనంతరం 163 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి 3 బంతుల్లో 2 పరుగులు అవసరమయ్యాయి.

'అబ్‌స్ట్రక్టింగ్‌ ద ఫీల్డ్‌' ఔట్:

ఖలీల్ అహ్మద్ వేసిన నాలుగో బంతికి షాట్‌ ఆడబోయి మిశ్రా విఫలమయ్యాడు. అయినా పరుగుకు ప్రయత్నించగా.. కీపర్‌ సాహా బంతిని విసరగా అది స్టంప్స్‌కు తాకలేదు. అనంతరం బంతిని అందుకున్న ఖలీల్‌ అహ్మద్.. నాన్‌-స్ట్రైకింగ్‌ వైపున్న స్టంప్స్‌కు విసిరాడు. ఇదే సమయంలో మిశ్రా స్టంప్స్‌కు అడ్డంగా పరుగెత్తాడు. దీంతో ఖలీల్‌ విసిరిన బంతి అతడికే తాకింది. దీనిపై ఖలీల్‌ థర్డ్ అంఫైర్ నిర్ణయాన్ని కోరాడు. ఖలీల్‌ త్రోకు ఉద్దేశపూర్వకంగా అడ్డుగా వెళ్లినందుకు ‘అబ్‌స్ట్రక్టింగ్‌ ద ఫీల్డ్‌' కింద అంఫైర్ అతడిని ఔట్‌గా ప్రకటించాడు.

భారత బెస్ట్ బ్యాట్స్‌మన్‌:

అబ్‌స్ట్రక్టింగ్‌ ద ఫీల్డ్‌ ద్వారా ఔట్ అవ్వడంతో క్రికెట్ అభిమానులు ట్విట్టర్ వేదికగా మిశ్రాపై వ్యంగంగా జోకులు పేల్చుతున్నారు. మరికొందరు ఇంకో అడుగు ముందుకేసి వీడియోలతో విమర్శలు చేస్తున్నారు. 'అమిత్ మిశ్రా భారత బెస్ట్ బ్యాట్స్‌మన్‌. అతడిని బౌలర్, కీపర్, ఫీల్డర్ ఎవ్వరూ ఔట్ చేయలేరు' అని ఓ అభిమాని పోస్ట్ చేసాడు. 'మిశ్రా వికెట్ల మధ్య పరుగెత్తడంలో గొప్ప రన్నర్' అని మరో అభిమాని పోస్ట్ చేసాడు.

Story first published: Thursday, May 9, 2019, 11:14 [IST]
Other articles published on May 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X