Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ చరిత్రలో రేయాన్ పరాగ్ అరుదైన రికార్డు

IPL 2019, DC vs RR: Riyan Parag youngest to hit an IPL fifty

హైదరాబాద్: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ యువ ఆటగాడు రేయాన్‌ పరాగ్‌ అరుదైన ఘనత సాధించాడు. టోర్నీలో భాగంగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రేయాన్ పరాగ్‌ 49 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ సాధించాడు. తద్వారా ఐపీఎల్‌ చరిత్రలో హాఫ్ సెంచరీ సాధించిన యువ ఆటగాడిగా అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌లో రేయాన్ పరాగ్ 17 సంవత్సరాల 175 రోజుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

18 సంవత్సరాల 169 రోజుల్లో

అంతకముందు 18 సంవత్సరాల 169 రోజుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాట్స్‌మెన్‌ సంజూ శాంసన్‌ పేరిట ఉన్న రికార్డును ఇప్పుడు రేయాన్ పరాగ్ బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో రేయాన్ పరాగ్ రాణించడంతో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్ 115 పరుగులు గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.

5 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం

5 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం

రహానే(2), లివింగ్‌ స్టోన్‌(14), సంజూ శాంసన్‌(5), లామ్రోర్‌(8), శ్రేయస్‌ గోపాల్‌(12), స్టువర్ట్‌ బిన్నీ(0), కృష్ణప్ప గౌతమ్‌(6), ఇష్‌ సోథీ(6)లు వరుసగా క్యూకట్టడంతో రాజస్థాన్ తక్కువ స్కోరుకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో వెటరన్‌ ఇషాంత్‌శర్మ, అమిత్‌ మిశ్రా రాణించడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన రాజస్థాన్

ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన రాజస్థాన్

ఈ ఓటమితో రాజస్థాన్‌ ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. కాగా, రాజస్థాన్‌ తరఫున 7 మ్యాచ్‌లాడిన పరాగ్‌ 32 సగటుతో 160 పరుగులు చేశాడు. కాగా, అత్యంత పిన్న వయసులోనే ఐపీఎల్‌ హాఫ్‌ సెంచరీలు బాదిన ఆటగాళ్లంతా ఈ మ్యాచ్‌లో ఆడటం విశేషం. ఢిల్లీ క్యాపిటల్స్‌ నుంచి రిషభ్‌పంత్‌, పృథ్వీషా ఉండగా, రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి సంజూ శాంసన్‌, రేయాగ్‌ పరాగ్‌‌లు ఉన్నారు.

Story first published: Sunday, May 5, 2019, 14:10 [IST]
Other articles published on May 5, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+