For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మిగిలిన రెండు మ్యాచులలో ఒత్తిడి లేకుండా ఆడుతాం: విరాట్ కోహ్లీ

IPl 2019 Virat Kohi Says 'We Will Play Other Two Matches With Out Any Pressure' || Oneindia Telugu
IPL 2019, DC vs RCB: Delhi Capitals played better than Royal Challengers says Virat Kohli

మిగిలిన రెండు మ్యాచులలో ఒత్తిడి లేకుండా ఆడుతాం. ఇదే సమయంలో అభిమానులకు వినోదాన్ని పంచుతాం అని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపారు. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 16 పరుగుల తేడాతో ఓడిపోయింది. ప్లే ఆఫ్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బెంగళూరు ఓడిపోయి.. ఐపీఎల్‌ 12లో లీగ్‌ దశలోనే నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది.

మ్యాచ్ అనంతరం బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ... 'ఇలాంటి వికెట్‌పై టాస్ చాలా కీలకం. ముందుగా మేం 160-165 టార్గెట్ ఉంటుందని ఊహించాం. కానీ ఢిల్లీ 180 పరుగులు చేసింది. స్పిన్నర్లను వారు బాగా ఎదుర్కొన్నారు. కీలక సమయాల్లో ఢిల్లీ బాగా బ్యాటింగ్ చేసింది. ఈ విజయానికి వారు అర్హులు' అని కోహ్లీ అన్నారు.

'మేము మంచి ఆరంభమే ఇచ్చాం. పవర్ ప్లేలో బాగా పరుగులు చేసాం. కానీ నేను, డివిలియర్స్‌ కీలక సమయంలో వికెట్లు కోల్పోయాం. ఇది మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపించింది. ఆటలో ఇలాంటివి చోటుచేసుకుంటాయి. మొదటి ఆరు మ్యాచులను మేం తీవ్ర ఒత్తిడిలో ఆడాం. ఆ తర్వాత వినోదం పంచాలని నిర్ణయించుకున్నాం. ఈ కారణంతోనే గత ఆరు మ్యాచులలో నాలుగు గెలిచాం. మిగిలిన రెండు మ్యాచులలో ఒత్తిడి లేకుండా ఆడుతాం. ఇదే సమయంలో అభిమానులకు వినోదాన్ని పంచుతాం. మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం' అని కోహ్లీ చెప్పుకొచ్చారు.

Story first published: Monday, April 29, 2019, 16:12 [IST]
Other articles published on Apr 29, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+