For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

DC vs MI: ముంబై ఇండియన్స్ చేతిలో చిత్తుగా ఓడిన ఢిల్లీ

IPL 2019 : Mumbai Indians Beat Delhi Capitals By 40 Runs || Oneindia Telugu
MI

హైదరాబాద్: ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబై ఇండియన్స్‌ నిర్దేశించిన 169 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 128 పరుగులకే పరిమితమైంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఓపెనర్లు పృథ్వీ షా 24 బంతుల్లో 20(2 ఫోర్లు), శిఖర్ ధావన్ 22 బంతుల్లో 35(5 ఫోర్లు, ఒక సిక్స్) పరుగులతో చక్కటి శుభారంభాన్నిచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 49 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత శిఖర్ ధావన్ తొలి వికెట్‌గా ఔటయ్యాడు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మిగతా బ్యాట్స్‌మన్ మున్రో(3), అయ్యర్(3), పంత్(7) స్వల్ప స్కోర్లకే పెవిలియన్‌కు చేరడంతో ఢిల్లీ 76 పరుగులకే 5 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. చివర్లో ఆక్సర్ పటేల్ 23 బంతుల్లో 26 (ఫోర్, సిక్స్), మోరిస్ (11) పరుగులతో ఫరవాలేదనిపించడంతో ఈ మాత్రం స్కోరన్నా చేయగలిగింది.


ఢిల్లీ క్యాపిటల్స్ విజయ లక్ష్యం 169
అంతకముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ముంబై ఓపెనర్లు రోహిత్‌శర్మ(30), క్వింటన్‌ డికాక్‌(35) దూకుడుగా ఆడి మంచి శుభారంభాన్ని అందించారు.

1
45910

వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 57 పరుగులు జోడించిన తర్వాత రోహిత్‌ శర్మ(30) పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బెన్‌ కటింగ్‌(2) తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరగా... మరో ఓపెనర్ డీకాక్‌(35) రనౌట్‌ అయ్యాడు. దీంతో ముంబై 74 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది.

ఈ దశలో సూర్యకుమార్‌ యాదవ్‌(26) నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని నడిపించాడు. జట్టు స్కోరు 104 పరుగుల వద్ద కగిసో రబాడ బౌలింగ్‌లో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌‌కు క్యాచ్ ఇచ్చి సూర్యకుమార్‌ యాదవ్‌ పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో పాండ్యా సోదరులు ఇన్నింగ్స్‌‌ను చక్కదిద్దారు.

కృనాల్‌ పాండ్యా 26 బంతుల్లో 37(5 ఫోర్లు), హార్దిక్‌ పాండ్యా 15 బంతుల్లో 32(2 ఫోర్లు, 3 సిక్సులు)తో మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో ముంబై ఇండియన్స్‌ నిర్ణీత ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. చివరి 3 ఓవర్లలో ముంబై ఇండియన్స్‌ బ్యాట్స్‌మెన్ 50 పరుగులు సాధించడం విశేషం. ఢిల్లీ బౌలర్లలో రబాడ రెండు వికెట్లు సాధించగా, అమిత్‌ మిశ్రా, అక్షర్‌ పటేల్‌లు తలో వికెట్‌ తీశారు.


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచకున్న ముంబై ఇండియన్స్
ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గత మ్యాచ్‌లోని జట్టునే కొనసాగిస్తుండగా.. ముంబై మాత్రం ఒక మార్పు చేసింది. జయంత్ యాదవ్ స్థానంలో బెన్‌ కట్టింగ్‌ని జట్టులోకి తీసుకుంది.

ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌ రోహిత్‌శర్మ టీ20ల్లో 8 వేల పరుగులు చేసిన మూడో భారత ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ 30 పరుగులు నమోదు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌కు ముందు 8వేల మైలురాయిని చేరడానికి 12 పరుగులు దూరంలో ఉన్నాడు. రోహిత్ కంటే ముందు సురేశ్‌ రైనా, విరాట్‌కోహ్లీలు ఈ ఘనత సాధించారు. రైనా 295 ఇన్నింగ్స్‌లో 8216 పరుగులు చేయగా.. కోహ్లీ 246 ఇన్నింగ్స్‌లో 8183 పరుగులు చేశాడు.

మరోవైపు రోహిత్‌ శర్మ 293 ఇన్నింగ్స్‌లో 7998 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లాడిన ముంబై ఇండియన్స్ ఐదింట విజయం సాధించి పది పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో పది పాయింట్లు ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ విషయంలో మెరుగ్గా ఉండటంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.

రెండు, మూడు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండటంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా సాగనుంది. టాస్ వేయడానికి ముందు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పిచ్‌ను పరిశీలించాడు. ఇందుకు సంబంధించిన వీడియోని ఐపీఎల్ తన అధికారిక ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. సచిన్ పిచ్‌ను పరిశీలిస్తున్న సమయంలో యువ క్రికెటర్లు పృథ్వీ షా, రిషబ్ పంత్ పక్కనే ఉన్నారు.

Story first published: Thursday, April 18, 2019, 23:48 [IST]
Other articles published on Apr 18, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+