Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs MI: ముంబై బ్యాటింగ్, అరుదైన రికార్డుకి చేరువలో రోహిత్

MI

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా గురువారం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గత మ్యాచ్‌లోని జట్టునే కొనసాగిస్తుండగా.. ముంబై మాత్రం ఒక మార్పు చేసింది. జయంత్ యాదవ్ స్థానంలో బెన్‌ కట్టింగ్‌ని జట్టులోకి తీసుకుంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌ రోహిత్‌శర్మ మరో 12 పరుగులు చేస్తే భారత్‌ తరఫున టీ20ల్లో 8 వేల పరుగులు చేసిన మూడో భారత ఆటగాడిగా అరుదైన ఘనత సాధిస్తాడు. రోహిత్ కంటే ముందు సురేశ్‌ రైనా, విరాట్‌కోహ్లీలు ఈ ఘనత సాధించారు. రైనా 295 ఇన్నింగ్స్‌లో 8216 పరుగులు చేయగా.. కోహ్లీ 246 ఇన్నింగ్స్‌లో 8183 పరుగులు చేశాడు.

మరోవైపు రోహిత్‌ శర్మ 293 ఇన్నింగ్స్‌లో 7998 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లాడిన ముంబై ఇండియన్స్ ఐదింట విజయం సాధించి పది పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో పది పాయింట్లు ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ విషయంలో మెరుగ్గా ఉండటంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.

1
45910

రెండు, మూడు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండటంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా సాగనుంది. టాస్ వేయడానికి ముందు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పిచ్‌ను పరిశీలించాడు. ఇందుకు సంబంధించిన వీడియోని ఐపీఎల్ తన అధికారిక ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. సచిన్ పిచ్‌ను పరిశీలిస్తున్న సమయంలో యువ క్రికెటర్లు పృథ్వీ షా, రిషబ్ పంత్ పక్కనే ఉన్నారు.

జట్ల వివరాలు:
ఢిల్లీ క్యాపిటల్స్

పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), కొలిన్ మున్రో, క్రిస్ మోరిస్, కీమో పాల్, అక్షర పటేల్, అమిత్ మిశ్రా, కగిసో రబాడ, ఇషాంత్ శర్మ

ముంబై ఇండియన్స్
రోహిత్ శర్మ(కెప్టెన్), క్వింటన్ డీకాక్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, బెన్ కటింగ్, హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, జయంత్ యాదవ్, రాహుల్ చాహర్, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా

Story first published: Thursday, April 18, 2019, 19:53 [IST]
Other articles published on Apr 18, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+