Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KXIP vs DC: గేల్ హాఫ్‌సెంచరీ, ఢిల్లీ టార్గెట్ 164

Gayle

హైదరాబాద్: ఫిరోజ్‌ షాకోట్లా వేదికగా ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో క్రిస్‌గేల్‌ 37 బంతుల్లో 69(6 ఫోర్లు, 5 సిక్సులు), మన్దీప్‌ సింగ్‌ 27 బంతుల్లో 30(ఫోర్, సిక్స్) రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటంగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ డేర్ డెవిల్స్‌‌కు 164 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఓపెనర్ కేఎల్‌ రాహుల్‌(12) స్వల్ప స్కోరుకే పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మయాంక్‌ అగర్వాల్‌(2), డేవిడ్‌ మిల్లర్‌(7)లు కూడా విఫలం కావడంతో పంజాబ్ 61 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో క్రిస్ గేల్, మన్దీప్‌ సింగ్‌లు నిలకడగా ఆడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.

వీరిద్దరూ కలిసి 45 పరుగులు జోడించిన తర్వాత క్రిస్ గేల్ 37 బంతుల్లో 69(6 ఫోర్లు, 5 సిక్సులు) అక్సర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత శామ్ కరన్‌(0) డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. మరో 23 పరుగుల వ్యవధిలో మన్దీప్‌ సింగ్‌(30) కూడా ఔటయ్యాడు. దీంతో క్రిస్ గేల్ ఔటైన తర్వాత పంజాబ్ స్కోరు బోర్డులో వేగం తగ్గింది.

చివర్లో అశ్విన్‌(16), హర్‌ప్రీత్ బ్రార్ 12 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 20 పరుగులు చేయడంతో పంజాబ్‌ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో లామిచానే మూడు వికెట్లు సాధించగా, కగిసో రబాడ, అక్షర్‌ పటేల్‌ చెరో రెండు వికెట్లు తీశారు.


టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ
ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు 9 మ్యాచ్‌లాడి చెరో 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి.

1
45913

అయితే, ఢిల్లీ నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉండటంతో మూడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. కోలిన్ ఇంగ్రామ్, లమిచానే, రూథర్‌ఫర్డ్‌లకు తుది జట్టులో చోటు కల్పించారు. మరోవైపు పంజాబ్ ఓ మార్పుతో బరిలోకి దిగుతోంది. మిస్టరీ స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్‌ను జట్టులోకి తీసుకుంది.

జట్ల వివరాలు
కింగ్స్ ఎలెవన్ పంజాబ్

కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్, డేవిడ్ మిల్లర్, మన్దీప్ సింగ్, శామ్ కర్రన్, రవిచంద్రన్ అశ్విన్(కెప్టెన్), హర్‌ప్రీత్ బ్రార్‌, హర్డుస్ విజయిన్, మురుగన్ అశ్విన్, మహ్మద్ షమీ,

ఢిల్లీ క్యాపిటల్స్
పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), కొలిన్ ఇన్‌గ్రామ్, రూథర్‌ఫర్డ్‌, అక్షర పటేల్, అమిత్ మిశ్రా, కగిసో రబాడ, ఇషాంత్ శర్మ, సందీప్ లమిచానే

Story first published: Saturday, April 20, 2019, 22:38 [IST]
Other articles published on Apr 20, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+