Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరుస సిక్సర్లతో చెలరేగిపోయిన రసెల్: ఢిల్లీ విజయ లక్ష్యం 186

Russel

హైదరాబాద్: ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌‌తో జరుగుతున్న మ్యాచ్‌‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆల్‌ రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ చెలరేగి ఆడాడు. ఆండ్రీ రసెల్ (62: 28 బంతుల్లో 4 ఫోర్లు, 6సిక్సులు), కెప్టెన్ దినేశ్ కార్తీక్ (50: 36 బంతుల్లో 5 ఫోర్లు, 2సిక్సులు) హాఫ్ సెంచరీలతో రాణించడంతో కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఓపెనర్లు నిక్కీ నాయక్ (7), క్రిస్‌లిన్ (20)తో పాటు రాబిన్ ఉతప్ప (11), నితీశ్ రాణా (1), శుభమన్ గిల్ (4) వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేరారు. దీంతో ఒకానొక దశలో 61/5తో పీకల్లోతు కష్టాల్లో నిలిచింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఆండ్రీ రసెల్‌ మెరుగైన స్థితిలో నిలిపాడు.

క్రీజులోకి వచ్చిన మొదట్లోనే హర్షల్ పటేల్ విసిరిన బీమర్ బంతి రసెల్‌ భుజానికి బలంగా తాకడంతో గాయమైంది. కానీ, ఫిజియో సపర్యల తర్వాత మళ్లీ బ్యాటింగ్‌ను కొనసాగించిన రసెల్ బౌలర్‌ ఎవరన్నది చూడకుండా వరుస సిక్సర్లతో చెలరేగిపోయాడు. దినేశ్‌ కార్తీక్‌‌తో కలిసి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన రసెల్‌ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

1
45766

క్రిస్‌ మోరిస్‌ వేసిన 18 ఓవర్‌ ఐదో బంతికి భారీ షాట్‌కు యత్నించిన రసెల్‌ ఔటయ్యాడు. అటు తర్వాత కార్తీక్‌ హాఫ్‌ సెంచరీ సాధించిన తర్వాత ఔటయ్యాడు. వీరిద్దరి జోడి 95 పరుగుల ఆరో వికెట్ భాగస్వామ్యాన్ని సాధించడంతో కేకేఆర్‌ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 185 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో హర్షల్‌ పటేల్‌ రెండు వికెట్లు తీయగా, అమిత్‌ మిశ్రా, రబడా, లామ్‌చెన్‌, క్రిస్‌ మోరిస్‌, అమిత్‌ మిశ్రాలు తలో వికెట్ తీశారు.

Story first published: Saturday, March 30, 2019, 22:43 [IST]
Other articles published on Mar 30, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+