న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫిరోజ్ షా కోట్లాలో DC vs CSK: ఢిల్లీ బ్యాటింగ్, అందరి చూపు పంత్‌వైపే

IPL 2019 : Delhi Capitals Won The Toss And Elected To Bat First
IPL 2019: DC Vs CSK: Live Updates: Delhi Capitals win the toss and elect to bat

హైదరాబాద్: ఐపీఎల్‌ 2019 సీజన్‌లో మరో ఆసక్తికరమైన పోటీకి మంగళవారం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియం సిద్ధమైంది. టోర్నీలో భాగంగా ఫిరోజ్‌ షా కోట్లా స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ సొంత మైదానం ఫిరోజ్ షా కోట్ల‌లో ఈ మ్యాచ్ జరుగుతుంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ సీజన్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు విజయాలను సాధించాయి. దీంతో ఈ మ్యాచ్‌లో కూడా ఇరు జట్లు అదే జోరుని కొనసాగించాలని భావిస్తున్నాయి. ముంబై ఇండియన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి ఢిల్లీ జట్టును గెలిపించిన పంత్‌ ఈ మ్యాచ్‌లో కీలకం కానున్నాడు. ఈసారి పంత్‌ ఏమాయ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరోవైపు పంత్‌ను కట్టడి చేస్తే డిల్లీ క్యాపిటల్స్‌ని తక్కువ స్కోరుకే పరిమితం చేయవచ్చని చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు భావిస్తోంది. చెన్నై బౌలర్లు ఇమ్రాన్‌ తాహిర్‌, హర్భజన్‌ సింగ్‌ గత మ్యాచ్‌లో తమ స్పిన్‌తో బెంగళూరు బ్యాట్స్‌మెన్‌ను 70 పరుగులకే కట్టడి చేసిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2019 సీజన్ లీగ్ ఆరంభ మ్యాచ్‌లో బెంగళూరుతో తలపడిన చెన్నై సూపర్ కింగ్స్ 12 బంతులు మిగిలుండగానే విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై స్పిన్నర్లు హర్భజన్ సింగ్ (3/20), ఇమ్రాన్ తాహిర్ (3/9), జడేజా (2/15) రాణించడంతో ఆ జట్టుని 17.1 ఓవర్లలో కేవలం 70 పరుగులకే ఆలౌట్ చేసింది.

అదే జోరుని కొనసాగించాలని చెన్నై సూపర్ కింగ్స్ ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ముంబై ఇండియన్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో సొంతగడ్డపై ఢిల్లీ కూడా అదే జోరుని చెన్నైపై కొనసాగించాలని ఆశిస్తోంది.

1
45761
Story first published: Wednesday, March 27, 2019, 9:59 [IST]
Other articles published on Mar 27, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X