హైదరాబాద్: ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే) ఆల్‌రౌండర్ డేవిడ్ విల్లే ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. ఇంగ్లాండ్‌కు చెందిన 29 ఏళ్ల ఈ పేస్ బౌలర్ విల్లే కుటుంబ కారణాల రీత్యా లీగ్‌లో ఆడడం లేదని ప్రకటించాడు. డేవిడ్ భార్య కరోలిన్ మరికొద్ది రోజుల్లో రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. దీంతో అతడు భారత్‌కు రాకుండానే ఇంగ్లాండ్‌లోనే ఉండిపోయాడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఈ సందర్భంగా డేవిడ్ విల్లే మాట్లాడుతూ "మరికొద్ది రోజుల్లో నా భార్య రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ సమయంలో నా భార్య దగ్గరే ఉండాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఐపీఎల్‌కు రావడం లేదు" అని విల్లే వెల్లడించాడు. తన పరిస్థితిని సీఎస్కే జట్టుతో పాటు యార్కషైర్ జట్టుకు కూడా చెప్పడం జరిగిందని, వారు అర్థం చేసుకుంటారన్న విశ్వాసముందని చెప్పాడు.
అయితే, ఈ నిర్ణయం అంత సులభమైన నిర్ణయం కాదని డేవిడ్ విల్లే వెల్లడించాడు. ఈ ఏడాది మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో డేవిడ్ విల్లేతో చెన్నై సూపర్ కింగ్స్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, అతడు ఏప్రిల్ 25 వరకు జట్టుతో అందుబాటులో ఉంటానని పేర్కొన్నాడు. తాజాగా టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు.