For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'గో డాడీ'.. వార్నర్‌ కూతురు సందడి (వీడియో)

IPL 2019 : A Sweet Moment In Hyderabad Brings A Smile On David Warner’s Face || Oneindia Telugu
IPL 2019: David Warner’s Daughter Cheering For Daddy During SRH v CSK Match

ఐపీఎల్‌లో తమ ఫేవరేట్ క్రికెటర్లు బౌండరీలు బాడుతుంటే స్టేడియంలోని అభిమానులు ఎంకరేజ్ చేస్తుంటారు. ఇది సర్వసాధారణమే. అయితే క్రికెటర్ల పిల్లలు కూడా వారిని ఎంకరేజ్ చేస్తుంటే ఆ కిక్కే వేరు. బుధవారం రాత్రి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

కూతురు ఎంకరేజ్.. తండ్రి చిరునవ్వులు:

చెన్నై టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకోవడంతో.. ఫీల్డింగ్ కోసం సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు మైదానంలోకి దిగారు. డేవిడ్‌ వార్నర్‌ తన జట్టు సభ్యులతో మాట్లాడుతున్నాడు. ఇదే సమయంలో వార్నర్‌ కూతురు ఇండి రే.. 'గో డాడీ' అని ఉన్న ప్లకార్డు చూపిస్తూ తండ్రిని ఎంకరేజ్ చేసింది. మైదానంలోని వార్నర్ ఇది చూసి చిరునవ్వులు చిందించాడు. వార్నర్‌తో పాటు రషీద్ ఖాన్, సందీప్ శర్మలు కూడా నవ్వులు పూయించారు.

ఐపీఎల్‌కే అందాన్ని తెస్తాయి:

ఐపీఎల్‌కే అందాన్ని తెస్తాయి:

దీనికి సంబంధించిన వీడియోను ఐపీఎల్‌ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసింది. 'ఇలాంటి ఘటనలు ఐపీఎల్‌కే అందాన్ని తెస్తాయి' అని ఓ కాప్షన్ పెట్టింది. వీడియో పోస్ట్ చేసిన కొద్ది వ్యవధిలోనే నెట్టింట్లో తెగ వైరల్ అయింది. దీనిపై అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్లు పెడుతున్నారు.

సన్‌రైజర్స్‌ విజయం:

సన్‌రైజర్స్‌ విజయం:

ఉప్పల్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌పై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 6 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. డుప్లెసిస్‌ (31 బంతుల్లో 45; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), వాట్సన్‌ (29 బంతుల్లో 31; 4 ఫోర్లు)లు రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌ 16.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసి విజయం సాధించింది. వార్నర్‌ (25 బంతుల్లో 50; 10 ఫోర్లు), బెయిర్‌స్టో (44 బంతుల్లో 61 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు.

Story first published: Thursday, April 18, 2019, 11:35 [IST]
Other articles published on Apr 18, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+