For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చెపాక్‌లో చెన్నైదే విజయం: తృటిలో సెంచరీ మిస్సైన షేన్ వాట్సన్

IPL 2019 : Chennai Super Kings Defeat Sunrisers Hyderabad By 6 Wickets || Oneindia Telugu
Watson

హైదరాబాద్: ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మరో విజయాన్ని నమోదు చేసింది. చెపాక్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తాజా విజయంలో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎకబాకింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

సన్‌రైజర్స్ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యాన్ని చెన్నై సూపర్ కింగ్స్‌ 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. చేధనలో షేన్ వాట్సన్ 53 బంతుల్లో 96 (9 ఫోర్లు, 6 సిక్సులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి సీఎస్‌కే విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో సీఎస్‌కేతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ సన్‌రైజర్స్ ఓడింది.

ఈ మ్యాచ్‌లో షేన్ వాట్సన్ హాఫ్ సెంచరీతో రాణించడంతో టీ20ల్లో ఎనిమిది వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. చెన్నై ఆటగాళ్లలో సురేశ్ రైనా 24 బంతుల్లో 38 (6 ఫోర్లు, ఒక సిక్స్), అంబటి రాయుడు 25 బంతుల్లో 21(ఒక ఫోర్) ఫరవాలేదనిపించారు.


చెన్నై విజయ లక్ష్యం 176
అంతకముందు డేవిడ్‌ వార్నర్‌ 45 బంతుల్లో 57(3 ఫోర్లు, 2 సిక్సర్లు), మనీష్‌ పాండే 49 బంతుల్లో 83 నాటౌట్‌ (7 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్‌కు 176 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఈ మ్యాచ్‌ ఆరంభంలోనే సన్‌రైజర్స్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. రెండో ఓవర్లోనే ఓపెనర్ బెయిర్‌స్టో పరుగులేమీ చేయకుండా పెవిలియన్‌ చేరాడు. హర్భజన్ బౌలింగ్‌లో బెయిర్‌స్టో (0) వికెట్ల వెనక ధోనీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అనతంరం క్రీజులోకి వచ్చిన మనీష్ పాండేతో కలిసి మరో ఓపెనర్ స్కోరు బోర్డుని ముందుకు నడిపించాడు.

1
45917

ఈ ఇద్దరూ కలిసి 115 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలోనే ముందుగా మనీష్‌ పాండే 13వ హాఫ్‌ సెంచరీ నమోదు చేయగా... ఆ తర్వాత కొద్ది సేపటికే వార్నర్ కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. ఐపీఎల్‌లో వార్నర్‌కు ఇది 43వ అర్ధ సెంచరీ. హాఫ్ సెంచరీ అనంతరం దూకుడుగా ఆడే క్రమంలో జట్టు స్కోరు 120 పరుగుల వద్ద వార్నర్‌ ఔటయ్యాడు.

వార్నర్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన విజయ్ శంకర్ రెండు ఫోర్లు, సిక్సర్‌తో 26 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్‌లో మనీష్ పాండే సెంచరీ చేసేలా కనిపించాడు. అయితే, చివర్లో చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 49 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేశాడు. ఇక చివరి ఓవర్లలో చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో సన్‌రైజర్స్‌ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో హర్భజన్‌ రెండు వికెట్లు తీయగా, దీపక్‌ చాహర్‌‌ వికెట్‌ తీశాడు.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్
అంతకముందు ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు మార్పులతో బరిలోకి దిగుతున్నాయి. సీఎస్‌కే జట్టులో శార్దూల్‌ ఠాకూర్‌ స్థానంలో హర్భజన్‌ సింగ్ తుది జట్టులో చోటు దక్కించుకోగా.... విలియమ్సన్‌, షాబాజ్‌ నదీం స్థానంలో మనీశ్‌ పాండే, షకీబ్‌ అల్‌ హసన్‌ జట్టులోకి వచ్చినట్లు తాత్కాలిక కెప్టెన్‌ భువ వివరించాడు.

ఈ మ్యాచ్‌కు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ దూరమయ్యాడు. విలియమ్సన్ నాయనమ్మ మరణ వార్త తెలియగానే వెంటనే న్యూజిలాండ్‌ బయలుదేరి వెళ్లాడు. జైపూర్‌ వేదికగా ఏప్రిల్ 27న రాజస్థాన్‌ రాయల్స్‌తో జరగనున్న మ్యాచ్‌కి అతడు అందుబాటులో ఉంటాడని సన్‌రైజర్స్‌ యాజమాన్యం ఓ ప్రకటనలో పేర్కొంది.

కాగా, ఈ సీజన్‌లో ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్‌ ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్ ఆరంభంలో భుజం గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు కేన్ విలియమ్సన్ దూరంగా కాగా అతడి స్థానంలో కెప్టెన్‌గా వ్యవహరించిన సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ మళ్లీ జట్టు పగ్గాలు చేపట్టాడు. ఈ సీజన్‌లో ధోని అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు.

గత రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఉత్సాహంతో బరిలోకి దిగుతుండగా... వరుస ఓటములతో చెన్నై సూపర్ కింగ్స్ జోరు కాస్త తగ్గింది. ఈ మ్యాచ్‌లో గనుక సీఎస్‌కే గెలిస్తే ప్లేఆఫ్‌ బెర్తు ఖాయం చేసుకుంటుంది. మరోవైపు ఈ సీజన్‌లో సీఎస్‌కేతో తలపడిన తొలి మ్యాచ్‌లోను సన్‌రైజర్స్ ఓడిపోయింది.

Story first published: Tuesday, April 23, 2019, 23:54 [IST]
Other articles published on Apr 23, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+