Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చెపాక్‌లో CSK vs SRH: టాస్ నెగ్గిన చెన్నై, సన్‌రైజర్స్ కెప్టెన్‌గా భువీ

IPL 2019, CSK vs SRH Live Score: Chennai Super Kings win the toss and elect to field

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా మంగళవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడునున్నాయి. చెపాక్‌లోని చిదంబరం స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు మార్పులతో బరిలోకి దిగుతున్నాయి.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

సీఎస్‌కే జట్టులో శార్దూల్‌ ఠాకూర్‌ స్థానంలో హర్భజన్‌ సింగ్ తుది జట్టులో చోటు దక్కించుకోగా.... విలియమ్సన్‌, షాబాజ్‌ నదీం స్థానంలో మనీశ్‌ పాండే, షకీబ్‌ అల్‌ హసన్‌ జట్టులోకి వచ్చినట్లు తాత్కాలిక కెప్టెన్‌ భువనేశ్వర్‌ కుమార్‌ వివరించాడు. ఈ మ్యాచ్‌కు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ దూరమయ్యాడు.

1
45917

విలియమ్సన్ నాయనమ్మ మరణ వార్త తెలియగానే వెంటనే న్యూజిలాండ్‌ బయలుదేరి వెళ్లాడు. జైపూర్‌ వేదికగా ఏప్రిల్ 27న రాజస్థాన్‌ రాయల్స్‌తో జరగనున్న మ్యాచ్‌కి అతడు అందుబాటులో ఉంటాడని సన్‌రైజర్స్‌ యాజమాన్యం ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, ఈ సీజన్‌లో ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్‌ ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

ఈ సీజన్ ఆరంభంలో భుజం గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు కేన్ విలియమ్సన్ దూరంగా కాగా అతడి స్థానంలో కెప్టెన్‌గా వ్యవహరించిన సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ మళ్లీ జట్టు పగ్గాలు చేపట్టాడు. ఈ సీజన్‌లో ధోని అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు.

గత రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఉత్సాహంతో బరిలోకి దిగుతుండగా... వరుస ఓటములతో చెన్నై సూపర్ కింగ్స్ జోరు కాస్త తగ్గింది. ఈ మ్యాచ్‌లో గనుక సీఎస్‌కే గెలిస్తే ప్లేఆఫ్‌ బెర్తు ఖాయం చేసుకుంటుంది. మరోవైపు ఈ సీజన్‌లో సీఎస్‌కేతో తలపడిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓడిపోయింది. దీంతో గత మ్యాచ్‌లో ఓటమికి సన్‌రైజర్స్ ప్రతీకారం తీర్చుకోవాలని కూడా భావిస్తోంది.

జట్ల వివరాలు
చెన్నై సూపర్ కింగ్స్

షేన్ వాట్సన్, డుప్లెసిస్, సురేశ్ రైనా, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, ధోని, బ్రావో, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్

సన్‌రైజర్స్ హైదరాబాద్
డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో, మనీష్ పాండే, షకీబ్ ఉల్ హాసన్, విజయ్ శంకర్, యూసఫ్ ఫఠాన్, దీపక్ హుడా, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ

Story first published: Tuesday, April 23, 2019, 19:56 [IST]
Other articles published on Apr 23, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+