న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చెన్నైలో CSK vs RR: టాస్ గెలిచిన రహానే, ధోని సేన బ్యాటింగ్

CSK

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ రెండో మ్యాచ్‌కి సిద్ధమైంది. రాజస్థాన్ రాయల్స్‌తో రాత్రి 8 గంటలకి ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రహానే ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లాడిన చెన్నై జట్టు రెండు వరుస విజయాలతో జోరుమీదుంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

మరోవైపు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిన రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో ఒత్తిడితో బరిలోకి దిగుతోంది. చెన్నై జట్టులోని ఆటగాళ్లు షేన్ వాట్సన్, అంబటి రాయుడు చక్కటి ఫామ్ ఉండగా, మిడిలార్డర్‌లో సురేశ్ రైనా, ధోని ఆ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ జట్టులో జోస్ బట్లర్, సంజు శాంసన్, కెప్టెన్ అజింక్య రహానె ఫామ్‌‌లో ఉన్నారు.

దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి బోణీ కొట్టాలని రాజస్థాన్ రాయల్స్ ఊవిళ్లూరుతోంది. మరొవైపు సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్‌ కావడంతో చెన్నై ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగవచ్చని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

1
45768
Story first published: Sunday, March 31, 2019, 19:59 [IST]
Other articles published on Mar 31, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X