చెపాక్‌లో చెన్నైతో మ్యాచ్: ఓపెనర్‌గా డివిలియర్స్.. బెంగళూరుకి మరో ఆప్షన్ లేదా?

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌కి సర్వం సిద్ధమైంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య శనివారం రాత్రి 8 గంటలకి జరిగే తొలి మ్యాచ్‌తో తాజా సీజన్‌కి తెరలేవనుంది. తొలి మ్యాచ్‌లో ధోని, విరాట్ కోహ్లీలు తలపడుతుండటంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఇప్పటివరకు ముగిసిన సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ మూడు సార్లు టైటిల్ విజేతగా నిలవగా... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్కసారిగా కూడా విజేతగా నిలవలేదు. దీంతో ఈ సీజన్‌ను విరాట్ కోహ్లీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఇందులో భాగంగా చెన్నైతో జరిగే తొలి మ్యాచ్‌లో ఏబీ డివిలియర్స్‌ను ఓపెనర్‌గా బరిలోకి దించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

డికాక్‌తో కలిసి కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా
గత సీజన్‌లో దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ డికాక్‌తో కలిసి కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా కొన్ని ఇన్నింగ్స్‌లు ఆరంభించాడు. ఆ తర్వాత డికాక్, మొయిన్ అలీ కలిసి ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ఇలా మార్పులు చేస్తూ వెళ్లిన బెంగళూరు జట్టు.. ఏ మ్యాచ్‌లోనూ మెరుగైన ఆరంభాన్ని అందుకోలేకపోయింది. చివరకు లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఓపెనర్ల విషయంలో ఆర్సీబీ పలు జాగ్రత్తలు
దీంతో ఈసారి ఓపెనర్ల విషయంలో ఆర్సీబీ పలు జాగ్రత్తలు తీసుకోనుంది. ఇందులో భాగంగా ప్రొఫెషనల్ ఓపెనర్‌తో కలిసి డివిలియర్స్‌ని ఓపెనర్‌గా పంపాలనే ఆలోచనలో ఆర్సీబీ యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. వికెట్ కీపర్‌గా ఉన్న పార్థీవ్ పటేల్ సుదీర్ఘకాలంగా ఓపెనర్‌గా ఆడుతున్నాడు.

డివిలియర్స్‌వైపే ఫ్రాంఛైజీ మొగ్గు!
పార్ధీవ్ పటేల్ ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్ కావడంతో అతనికి తోడుగా.. మరో ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ (మొయిన్ అలీ)ని పంపడం కంటే కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్‌ని జోడీగా పంపాలని బెంగళూరు యాజమాన్యం భావిస్తోంది. ఈ చర్చల్లో తొలుత విరాట్ కోహ్లీ పేరు తెరపైకి వచ్చినప్పటికీ... చివరకి ఏబీ డివిలియర్స్‌వైపే ఫ్రాంఛైజీ మొగ్గు చూపిందంట.

తొలి ఆరు ఓవర్లలో పవర్‌ప్లే
అంతేకాదు తొలి ఆరు ఓవర్లలో పవర్‌ప్లే ఉంటుంది కాబట్టి.. ఫీల్డింగ్ కూడా పరిమితులతో కూడుకని ఉంటుంది. దీంతో ఏబీ డివిలియర్స్ అయితే బాగా పరుగులు సాధించడగలడని భావిస్తోన్న ఫ్రాంఛైజీ.. కోహ్లీని మూడు లేదా నాలుగో స్థానంలో ఆడించాలని భావిస్తోంది.

జట్ల అంచనా:
బెంగళూరు జట్టు అంచనా: పార్థీవ్ పటేల్ (వికెట్ కీపర్), ఏబీ డివిలియర్స్, మొయిన్ అలీ, విరాట్ కోహ్లీ (కెప్టెన్), సిమ్రాన్ హిట్‌మెయిర్, శివమ్ దుబే, వాషింగ్టన్ సుందర్, టిమ్ సౌథీ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్, చాహల్
చెన్నై సూపర్ కింగ్స్: షేన్ వాట్సన్, అంబటి రాయుడు, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్, కెప్టెన్), కేదార్ జాదవ్, బిల్లింగ్స్, డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, శాంట్నర్, శార్ధూల్ ఠాకూర్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications