ధోని రిటైర్మెంట్ తీసుకుంటే చెన్నైజట్టు రద్దు చేయండి: ముంబైతో ఓటమిపై నెటిజన్ల ట్వీట్లు

హైదరాబాద్: చెపాక్ వేదికగా శుక్రవారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 46 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో చెన్నై సూపర్ కింగ్స్‌పై జోకులు పేలుతున్నాయి. ధోని లేకుంటే చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ గెలవదంటూ? అభిమానులు ట్రోల్ చేస్తున్నారు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ధోనిపైనే సీఎస్‌కే ఆధారపడింది
ధోనిపైనే సీఎస్‌కే ఆధారపడిందని, ధోని లేకపోతే జట్టు ఓడిపోతుందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇది ఎంతమాత్రం మంచిది కాదని ఆ జట్టు అభిమానులు మండిపడుతున్నారు. కాగా, ఈ సీజన్‌లో ఇప్పటికే చెన్నైసూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖాయం చేసుకున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ... సొంతగడ్డపై ముంబై చేతిలో ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

జ్వరం కారణంగా ఈమ్యాచ్‌కు ధోని దూరం
జ్వరం కారణంగా ఈమ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని దూరం కావడంతో అతడి స్థానంలో సురేశ్ రైనా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. వికెట్ కీపర్‌గా అంబటి రాయుడు విధులు నిర్వహించాడు. ఈ మ్యాచ్‌లో ధోని లేని లోటు స్పష్టంగా కనిపించింది. ధోని టీమ్‌లో ఉంటే.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో ప్రత్యర్థికి గట్టి పోటీనిచ్చే చెన్నై... ఈ మ్యాచ్‌లో తేలిపోయింది.

ధోని లేకుండా రెండు సార్లు బరిలోకి
ధోని లేకుండా ఈ సీజన్‌లో రెండు సార్లు బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్.... రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైంది. ఏప్రిల్ 17న ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌కి గాయం కారణంగా ధోనీ దూరమవ్వగా.. ఆ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన చెన్నై.. తాజాగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఓడిపోయింది.

సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు దిగిన నెటిజన్లు
ఇప్పడు ఇదే అంశంపై చెన్నై అభిమానులు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు దిగారు. ఫన్నీ మీమ్స్, కామెంట్స్‌తో ఆటగాళ్లను ఆడుకుంటున్నారు. ధోని లేకుంటే చెన్నై జట్టు ఉత్తదేనని, అతను లేకుండా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదని కామెంట్ చేస్తున్నారు. ధోని రిటైర్మెంట్ తీసుకుంటే చెన్నైజట్టు రద్దు చేసుకోవాలని సూచిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications