For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2019, CSK vs MI: చెపాక్‌లో రోహిత్ శర్మ రికార్డుల మోత

IPL 2019 : Mumbai Indians Captain Rohit Sharma Creates Unique Records In IPL || Oneindia Telugu
IPL 2019, CSK vs MI: Mumbai Indians captain Rohit Sharma creates unique records

హైదరాబాద్: చెపాక్ వేదికగా శుక్రవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుని నెలకొల్పాడు. ఐపీఎల్‌లో అత్యధిక మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌లు అందుకున్న భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో యూసఫ్‌ పఠాన్‌, ఎంఎస్‌ ధోనిల రికార్డుని అధిగమించాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

48 బంతుల్లో 67 పరుగులు చేసిన రోహిత్

శుక్రవారం రాత్రి సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ 48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 67 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సందర్భంగా మ్యాచ్ అనంతరం మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డుని అందుకున్నాడు. ఐపీఎల్‌లో రోహిత్ శర్మకు ఇది 17వ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు కావడం విశేషం.

పఠాన్, ధోని రికార్డు బద్దలు

పఠాన్, ధోని రికార్డు బద్దలు

దీంతో యూసఫ్‌ పఠాన్‌, ధోని (16 - మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌) అవార్డుల రికార్డుని రోహిత్ శర్మ అధిగమించాడు. కాగా ఈ జాబితాలో సురేశ్‌ రైనా 14 సార్లు, గౌతమ్‌ గంభీర్‌ 13 సార్లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక, విరాట్‌ కోహ్లి, అజింక్య రహానే 12 సార్లు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్' దక్కించుకున్నారు.

సీఎస్‌కేపై అత్యధిక సెంచరీలు

సీఎస్‌కేపై అత్యధిక సెంచరీలు

అంతేకాదు ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుపై అత్యధిక అర్ధసెంచరీలు సాధించిన ఆటగాడిగా కూడా రోహిత్ శర్మ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. సీఎస్‌కేపై 25 మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌ 7 అర్ధ సెంచరీలు బాదాడు.

ఈ జాబితాలో డేవిడ్‌ వార్నర్‌ (6), శిఖర్‌ ధావన్‌(6), కోహ్లి (6) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

రోహిత్ శర్మకు అచ్చొచ్చిన చెపాక్ స్టేడియం

రోహిత్ శర్మకు అచ్చొచ్చిన చెపాక్ స్టేడియం

చెపాక్‌ స్టేడియం రోహిత్‌ శర్మకు కలిసొచ్చింది. ఈ మైదానంలో అతడు బరిలోకి దిగిన ఆరు సార్లు జట్టుకు విజయాన్ని అందించాడు. డెక్కన్‌ చార్జర్స్‌ తరపున రెండు సార్లు(2008, 2010), ముంబై ఇండియన్స్‌ తరుపున (2012, 2013), ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా (205, 2019) నాలుగు సార్లు జట్టుకు విజయాలను అందించాడు.

చెన్నైపై 46 పరుగుల తేడాతో ముంబై విజయం

చెన్నైపై 46 పరుగుల తేడాతో ముంబై విజయం

చెపాక్ వేదికగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ముంబై 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 156 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 17.4 ఓవర్లకు గాను 109 పరుగులకే కుప్పకూలింది. చెన్నై బ్యాట్స్‌మెన్‌లో ఓపెనర్‌ మురళీ విజయ్‌ 35 బంతుల్లో 38(3 ఫోర్లు, సిక్స్)తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాట్స్‌మెన్ షేన్ వాట్సన్(8), సురేశ్ రైనా(2,) అంబటి రాయుడు (0), కేదార్ జాదవ్(6) సింగిల్ డిజిట్‌కే పరిమితం కాగా బ్రావో(20), శాంట్నర్‌(22) ఫరవాలేదనిపించారు. ముంబై బౌలర్లలో మలింగ నాలుగు వికెట్లు, కృనాల్‌, బుమ్రా రెండేసి వికెట్లు తీశారు. అంకుర్ రాయ్‌, హార్దిక్‌ పాండ్యా చెరో వికెట్‌ తీశారు.

Story first published: Saturday, April 27, 2019, 11:32 [IST]
Other articles published on Apr 27, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+