
హైదరాబాద్: చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ శర్మ 48 బంతుల్లో 67(6 ఫోర్లు, 3 సిక్సులు)తో రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్‌కు 156 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై 24 పరుగుల వద్ద ఓపెనర్ క్వింటన్ డికాక్(15) వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఎవిన్ లూయిస్‌తో కలిసి కెప్టెన్ రోహిత్ శర్మ మరో వికెట్ కోల్పోకుండా ఆడుతూనే స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు.
ఈ క్రమంలో జట్టు స్కోరు 99 పరుగుల వద్ద లూయిస్ (32) ఔటయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే కృనాల్ పాండ్యా (1) కూడా పెవిలియన్‌కు చేరడంతో ముంబై పరుగుల వేగం తగ్గింది. ఒకానొక దశలో స్కోరు 200 పరుగులు దాటుతుందని అంతా భావించారు. రోహిత్ శర్మ ఔట్ కావడంతో స్కోరుబోర్డు నెమ్మదించింది.
ఈ మ్యాచ్‌లో 48 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 6 ఫోర్లు, మూడు సిక్సర్లతో 67 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో పొలార్డ్ నిరాశపరిచాడు. చివర్లో హార్దిక్ పాండ్యా ఓ సిక్సర్, ఫోర్‌తో 23 పరుగులు చేయడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై
అంతకముందు ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ సురేశ్ రైనా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. జ్వరం కారణంగా ఈ మ్యాచ్‌కి రెగ్యులర్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని దూరమయ్యాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు మూడు మార్పులతో ఈ మ్యాచ్ బరిలో దిగింది. ధోనీ, రవీంద్ర జడేజా, డుప్లెసిస్‌ల స్థానంలో ధృవ్ షోరే, మురళీ విజయ్, మిచెల్ శాంట్నర్‌లు తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.
మరోవైపు ఈ మ్యాచ్‌లో ముంబై రెండు మార్పులు చేసింది. బెన్ కట్టింగ్, మయాంక్ మార్కండే స్థానంలో ఎవిన్ లూయిస్, అంకుర్ రాయ్‌లను తీసుకన్నారు. ధోని స్థానంలో సురేశ్ రైనా కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. మరోవైపు ఈ మ్యాచ్‌తో ముంబై ఇండియన్స్ తరుపున అంకుర్ రాయ్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు.
ఈ మ్యాచ్‌కి ముందు లసిత్ మలింగ చేతుల మీదగా యువ ఆటగాడు అంకుర్ రాయ్ ముంబై ఇండియన్స్ క్యాప్‌ని అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోని ఐపీఎల్ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది.
ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించి సీఎస్‌కే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... ముంబై ఇండియన్స్ 12 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్‌ను సీఎస్‌కే ఘనంగా ప్రారంభించింది. మొదటి 8 మ్యాచ్‌ల్లో ఏడింట గెలిచింది.
ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. మంగళవారం సొంతగడ్డపై సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచి ఫామ్‌లోకి వచ్చింది. ఈ మ్యాచ్‌లో గనుక ముంబై ఇండియన్స్ విజయం సాధిస్తే ప్లేఆఫ్‌కు మరింతగా చేరువ అవుతుంది. ఈ సీజన్‌లో చెన్నైతో వాంఖడే జరిగిన మ్యాచ్‌లో ముంబై విజయం సాధించింది.
దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్రతీకారం తీర్చుకోవాలని చెన్నై భావిస్తోంది. కాగా, చెపాక్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 27 మ్యాచ్‌లు జరగ్గా సీఎస్‌కే 12, ముంబై ఇండియన్స్ 15 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్ సీఎస్‌కే సొంతగడ్డపై జరుగుతన్నప్పటికీ ముంబై ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.
జట్ల వివరాలు:
ముంబై ఇండియన్స్:
క్వింటన్ డీకాక్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), సూర్య కుమార్ యాదవ్, లూయిస్, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, రాహుల్ చాహర్, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా, అంకుర్ రాయ్
చెన్నై సూపర్ కింగ్స్:
షేన్ వాట్సన్, మురళీ విజయ్, సురేశ్ రైనా, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, బ్రావో, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్, డ్వేన్ బ్రావో, ధృవ్ షోరే, మిచెల్ శాంట్నర్