Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్వాలిఫయిర్ 1: CSK vs MI: గత హైలెట్స్, హెడ్ టు హెడ్ రికార్డులివే!

IPL 2019 : Chennai Super Kings vs Mumbai Indians : Head-To-Head Records || Oneindia Telugu
IPL 2019, CSK vs MI: Head-to-head record, probable XI and players to watch out for

హైదరాబాద్: ఐపీఎల్ 12వ సీజన్ లీగ్ దశ ముగిసింది. ప్లేఆఫ్స్‌కు చేరిన నాలుగు జట్లు ఏవో కూడా తెలిసిపోయాయి. చెన్నై, ముంబై, ఢిల్లీ ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు చేరుకోగా... టోర్నీలో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ చేతిలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 9 వికెట్ల తేడాతో ఓడటంతో మెరుగైన రన్‌రేట్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ప్లేఆఫ్‌ బెర్త్‌ను ఖాయం చేసుకుంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

టోర్నీలో భాగంగా మే 7వ తేదీన చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనున్న తొలి క్వాలిఫయిర్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ సీజన్‌లో ఇరు జట్లు 14 పాయింట్లు సాధించినప్పటికీ... రన్ రేట్ విషయంలో మాత్రం ముంబై ఇండియన్స్ మెరుగ్గా ఉంది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది.

అంతేకాదు తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబై విజయం సాధించగా... చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది. మంగళవారం ఇరు జట్ల మధ్య తొలి క్వాలిఫయిర్ జరగనున్న నేపథ్యంలో హెడ్ టు హెడ్ రికార్డులను ఒక్కసారి పరిశీలిద్దాం...

హెడ్ టు హెడ్ రికార్డు

హెడ్ టు హెడ్ రికార్డు

గతంలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 28 సార్లు తలపడ్డాయి. ఇందులో ముంబై ఇండియన్స్ 16 సార్లు విజయం సాధించగా... 12 సార్లు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించింది. ఐపీఎల్ 12 సీజన్‌లో చెన్నైతో తలపడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ముంబై ఇండియన్సే విజయం సాధించడం విశేషం. వాంఖడె స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 37 పరుగులు, చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 46 పరుగుల తేడాతో ముంబై విజయం సాధించింది.

సీఎస్‌కే జట్టులో చూడదగ్గ ఆటగాడు - ఇమ్రాన్ తాహిర్

సీఎస్‌కే జట్టులో చూడదగ్గ ఆటగాడు - ఇమ్రాన్ తాహిర్

దక్షిణాప్రికా వెటరన్ స్పిన్నర్ అయిన ఇమ్రాన్ తాహిర్ ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఈ సీజన్‌లో ఇమ్రాన్ తాహిర్ ఇప్పటివరకు ఆడిన 14 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు తీశాడు. అంతేకాదు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ కగిసో రబాడ తర్వాత పర్పుల్ క్యాప్ రేసులో ఉన్న ఆటగాడు ఇమ్రాన్ తాహిరే.

ముంబై జట్టులో చూడదగ్గ ఆటగాడు - హార్ధిక్ పాండ్యా

ముంబై జట్టులో చూడదగ్గ ఆటగాడు - హార్ధిక్ పాండ్యా

ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 14 మ్యాచ్‌ల్లో హార్ధిక్ పాండ్యా 197 స్ట్రయిక్ రేట్‌తో 373 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లోని మిగతా జట్లకు ముంబై జట్టుకు తేడా అతడే. ఒంటిచేత్తో ముంబైకి విజయాలనందించాడు. ఇక, బంతితో సైతం మెరుపులు మెరిపించాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే హార్ధిక్ పాండ్యా 14 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

జట్ల అంచనా

జట్ల అంచనా

చెన్నై సూపర్ కింగ్స్

షేన్ వాట్సన్, డుప్లెసిస్, సురేశ్ రైనా, అంబటి రాయుడు, మురళీ విజయ్, మహేంద్ర సింగ్ ధోని, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, దీపక్ చాహర్, హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్

ముంబై ఇండియన్స్

రోహిత్ శర్మ(కెప్టెన్), క్వింటన్ డీకాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్యా, హార్ధిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, రాహుల్ చాహర్, మిచెల్ మిక్లెన్ గన్, లసిత్ మలింగ, బుమ్రా

Story first published: Monday, May 6, 2019, 15:56 [IST]
Other articles published on May 6, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+