
హైదరాబాద్: చెపాక్ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో డుప్లెసిస్ 38 బంతుల్లో 54(2 ఫోర్లు, 4 సిక్సులు) హాఫ్ సెంచరీతో చెలరేగడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. దీంతో పంజాబ్‌కు 161 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
చెన్నై ఓపెనర్లు షేన్ వాట్సన్, డుప్లెసిస్‌లు ఇన్నింగ్స్‌ను దూకుడగా ఆరంభించారు. వీరిద్దరూ కలిసి 56 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత అశ్విన్ బౌలింగ్‌లో షేన్ వాట్సన్ 24 బంతుల్లో 26(3 ఫోర్లు, 1 సిక్స్) వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రైనాతో కలిసి డుప్లెసిస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.
ఈ క్రమంలో డుప్లెసిస్ 38 బంతుల్లో 54(2 ఫోర్లు, 4 సిక్సులు) హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత జట్టు స్కోరు 100 పరుగుల వద్ద అశ్విన్ బౌలింగ్‌లో డేవిడ్ మిల్లర్‌కు క్యాచ్ ఇచ్చి డుప్లెసిస్ ఔటయ్యాడు. ఆ తర్వాతి బంతికి రైనా(17) కూడా ఔట్ కావడంతో చెన్నై 100 పరుగుల వద్దే మూడో వికెట్‌ను కోల్పోయింది.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ధోని 23 బంతుల్లో 37 నాటౌట్ (4 ఫోర్లు, 1 సిక్స్), అంబటి రాయుడు 15 బంతుల్లో 21 నాటౌట్ (1 ఫోర్, 1 సిక్స్)లు 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. చెన్నై కోల్పోయిన మూడు వికెట్లు అశ్విన్‌కే దక్కాయి.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సీఎస్‌కే
అంతకముందు టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఐపీఎల్‌లో ధోనికి ఇది 150వ మ్యాచ్ కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు పలు మార్పులతో బరిలోకి దిగుతున్నాయి. గత సోమవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌కి దూరమైన క్రిస్ గేల్‌కు ఈ మ్యాచ్‌లో చోటు లభించింది.
మరొకవైపు ఆండ్రూ టై కూడా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తుది జట్టులో చోటు దక్కింది. తొడ కండరాల గాయంతో చెన్నై ఆల్ రౌండర్ డ్వేన్ బ్రేవో ఈ మ్యాచ్‌కి దూరమయ్యాడు. మరోవైపు మోహిత్ శర్మ, శార్దూల్ ఠాకూర్‌ల స్థానాల్లో కుగ్లీన్, హర్భజన్, డుప్లెసిస్‌లను తుది జట్టులోకి తీసుకున్నారు.
ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఇరు జట్లు తలో నాలుగు మ్యాచ్‌లు ఆడి మూడేసి మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. చెపాక్‌లోని చిదంబరం స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండటంతో ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. దీంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది.
జట్ల వివరాలు:
చెన్నై సూపర్ కింగ్స్:
షేన్ వాట్సన్, అంబటి రాయుడు, సురేశ్ రైనా, డుప్లెసిస్, కేదార్ జాదవ్, ధోని, జడేజా, కుగ్గీల్జిన్, చాహర్, హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్
కింగ్స్ ఎలెవన్ పంజాబ్:
కేఎల్ రాహుల్, క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్, డేవిడ్ మిల్లర్, ఖాన్, సింగ్, శామ్ కర్రన్, అశ్విన్, ఎమ్ అశ్విన్, ఆండ్రూ టై, షమీ