న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2019, CSK vs KXIP: చెన్నై బ్యాటింగ్, ధోనికి 150వ మ్యాచ్

 IPL 2019, CSK vs KXIP IPL Score: Chennai Super Kings win the toss and elect to bat

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా శనివారం చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ జట్లు తలపడుతున్నాయి. చెపాక్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఐపీఎల్‌లో ధోనికి ఇది 150వ మ్యాచ్ కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు పలు మార్పులతో బరిలోకి దిగుతున్నాయి.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

గత సోమవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌కి దూరమైన క్రిస్ గేల్‌కు ఈ మ్యాచ్‌లో చోటు లభించింది. మరొకవైపు ఆండ్రూ టై కూడా కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్ తుది జట్టులో చోటు దక్కింది. తొడ కండరాల గాయంతో చెన్నై ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో ఈ మ్యాచ్‌కి దూరమయ్యాడు. మరోవైపు మోహిత్‌ శర్మ, శార్దూల్‌ ఠాకూర్‌ల స్థానాల్లో కుగ్లీన్‌, హర్భజన్‌, డుప్లెసిస్‌లను తుది జట్టులోకి తీసుకున్నారు.

ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఇరు జట్లు తలో నాలుగు మ్యాచ్‌లు ఆడి మూడేసి మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. చెపాక్‌లోని చిదంబరం స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండటంతో ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. దీంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది.

1
45894

జట్ల వివరాలు:
చెన్నై సూపర్ కింగ్స్:

షేన్ వాట్సన్, అంబటి రాయుడు, సురేశ్ రైనా, డుప్లెసిస్, కేదార్ జాదవ్, ధోని, జడేజా, కుగ్గీన్, చాహర్, హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్

కింగ్స్ ఎలెవన్ పంజాబ్:
కేఎల్ రాహుల్, క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్, డేవిడ్ మిల్లర్, ఖాన్, మన్‌దీప్‌ సింగ్‌, శామ్ కర్రన్, అశ్విన్, మురుగన్‌ అశ్విన్‌, ఆండ్రూ టై, షమీ

Story first published: Saturday, April 6, 2019, 15:59 [IST]
Other articles published on Apr 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X