Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK vs KKR: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ధోని

IPL 2019, CSK vs KKR Live Score: MS Dhoni wins the toss and elects to bowl first against the KKR

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. చెపాక్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు గత మ్యాచ్‌లో ఆడిన జట్లతోనే బరిలోకి దిగుతున్నాయి.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ సీజన్‌లో ఇరు జట్లు వరుస విజయాలతో దూసుకుపోతున్నాయి. ఆడిన ఐదు మ్యాచుల్లో చెరో నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించి ఎనిమిది పాయింట్లు సాధించాయి. నెట్‌ రన్‌రేట్‌ వల్ల కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. చెన్నై సూపర్ కింగ్స్ రెండో స్థానంలో నిలిచింది. దీంతో ఇరు జట్లూ ఈ మ్యాచ్‌ గెలవాలనే పట్టదలతో కనిపిస్తున్నాయి.

ఈ సీజన్‌లో ఆండ్రీ రసెల్ తన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో కోల్‌కతా గెలిచిన నాలుగు మ్యాచ్‌ల్లో ఆండ్రీ రసెల్ కీలకపాత్ర పోషించాడు. ఈడెన్‌ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై 19 బంతుల్లో 49 పరుగులు... పంజాబ్‌పై 17బంతుల్లో 48 పరుగులు చేసి ఓటమి అంచున ఉన్న కోల్‌కతాను విజయతీరాలకు చేర్చాడు.

1
45899

దీంతో ఈ మ్యాచ్‌లో ఆండ్రీ రసెల్‌ను సీఎస్‌కే కెప్టెన్ ధోని ఎలా అడ్డుకుంటాడనే దానిపై అభిమానుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌కి ధోని సేన సొంతగడ్డపై జరుగుతుండటంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. ధోని నేతృత్వంలోని చెన్నై వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచి ఆ తర్వాత ముంబై చేతిలో ఓడినప్పటికీ శనివారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో మళ్లీ విజయం సాధించింది.


జట్ల వివరాలు:
చెన్నై సూపర్ కింగ్స్:

షేన్ వాట్సన్, డుప్లెసిస్, సురేశ్ రైనా, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, మహేంద్రసింగ్ ధోనీ, రవీంద్ర జడేజా, హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్, దీపక్ చాహర్, స్కాట్ కుగెల్జిన్‌.

కోల్‌కతా నైట్‌రైడర్స్:
క్రిస్ లిన్, సునీల్ నరైన్, రాబిన్ ఉతప్ప, శుభ్‌మన్ గిల్, నితీశ్ రాణా, దినేశ్ కార్తీక్ (కెప్టెన్), ఆండ్రూ రసెల్, పీయూష్ చావ్లా, కుల్దీప్ యాదవ్, లాకీ ఫెర్గ్యూసన్, ప్రసీద్ కృష్ణ.

Story first published: Tuesday, April 9, 2019, 19:51 [IST]
Other articles published on Apr 9, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+