For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ధోనీ రివ్యూ సిస్టం' సక్సెస్.. పెవిలియన్‌కు పృథ్వీషా

IPL 2019: CSK vs DC: Watch: Dhoni Review System (DRS) strikes again as Deepak Chahar sends Prithvi Shaw packing

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ డెసీషన్‌ రివ్యూ సిస్టం (డీఆర్‌ఎస్‌) కోరాడంటే దాదాపు బ్యాట్స్‌మన్‌ పెవిలియన్ చేరినట్టే. వికెట్ల వెనకాల ఉండి కచ్చితంగా అంచనా వేస్తాడు కాబట్టే 'డెసీషన్‌ రివ్యూ సిస్టం' కాస్త.. భారత్‌లో 'ధోనీ రివ్యూ సిస్టం' అయింది. ధోనీ కోరిన రివ్యూల్లో 86 శాతం సఫలమయ్యాడు. అంటే దాదాపు డీఆర్‌ఎస్‌కు సమానంగా ధోనీ నిర్ణయం ఉంటుంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

శుక్రవారం విశాఖ స్టేడియం వేదికగా జరిగిన క్వాలిఫయర్‌-2లో కూడా 'ధోనీ రివ్యూ సిస్టం' సక్సెస్ అయింది. చెన్నై పేస్ బౌలర్ దీపక్‌ చాహర్‌ వేసిన బంతి ఢిల్లీ బ్యాట్స్‌మన్‌ పృథ్వీషా ప్యాడ్స్‌కు తాకింది. చాహర్‌, ధోనీ ఎల్బీ కోసం అప్పీల్‌ చేసినా.. అంపైర్‌ ఔటివ్వలేదు. వెంటనే చాహర్‌తో చర్చించి ధోనీ రివ్యూ కోరాడు. రిప్లేలో బంతి వికెట్లను తాకుతున్నట్లు తేలింది. దీంతో అంపైర్‌ ఔట్‌గా ప్రకటించాడు. పృథ్వీషా నిరాశగా పెవిలియన్‌కు చేరాడు.

అనంతరం ఇన్నింగ్స్ చివరలో స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ వేసిన బంతి ఢిల్లీ బ్యాట్స్‌మన్‌ ప్యాడ్స్‌కు తాకింది. తాహిర్ ఎల్బీ కోసం అప్పీల్‌ చేసినా.. అంపైర్‌ ఔటివ్వలేదు. వెంటనే తాహిర్.. ధోనీని రివ్యూ కోరామన్నాడు. విముఖంగానే ధోనీ రివ్యూ కోరగా.. బంతి వికెట్ల కంటే ఎత్తులో వెళ్లడంతో చెన్నై రివ్యూ కోల్పోయింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. రిషభ్‌ పంత్‌ (25 బంతుల్లో 38; 2 ఫోర్లు, 1 సిక్స్‌) చెలరేగగా.. కొలిన్‌ మున్రో (24 బంతుల్లో 27; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. చెన్నై బౌలర్లలో బ్రేవో, జడేజా, హర్భజన్, దీపక్‌ చహర్‌ తలా రెండు వికెట్లు తీశారు. ఛేదనలో చెన్నై 19 ఓవర్లలో 4 వికెట్లకు 151 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు షేన్‌ వాట్సన్‌ (32 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), డుప్లెసిస్‌ (39 బంతుల్లో 50; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలతో రాణించారు.

Story first published: Saturday, May 11, 2019, 17:42 [IST]
Other articles published on May 11, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+