Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అప్పుడు అడ్డుకున్నా.. ఇప్పుడు షూలేస్‌ కట్టాడు

IPL 2019,Qualifier 2 : Funniest Memes From Chennai Super Kings V Delhi Capitals ! || Oneindia Telugu
IPL 2019: CSK vs DC: Suresh Raina tying Rishabh Pants shoelaces

లీగ్ దశలో తలపడిన మ్యాచ్‌లో క్రీజ్‌లోకి వస్తున్న చెన్నై బ్యాట్స్‌మన్‌ సురేష్ రైనాకు అడ్డుగా నిలబడి.. ఢిల్లీ యువ వికెట్ కీపర్ రిషభ్‌ పంత్‌ ఆటపట్టించాడు. అయినా అవేమీ పట్టించుకోకుండా పంత్‌ షూస్‌ లేస్‌ ఉడిపోగానే.. సురేశ్‌ రైనా వెళ్లి లేస్‌ కట్టాడు. విశాఖ వేదికగా శుక్రవారం జరిగిన ఐపీఎల్‌ క్వాలిఫైయర్‌ మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

షూ లేస్‌ కట్టాడు:

మొదటగా టాస్ నెగ్గి చెన్నై కెప్టెన్ ధోనీ బౌలింగ్ ఎంచుకోవడంతో.. ఢిల్లీ బ్యాటింగ్ కు దిగింది. ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఢిల్లీ జట్టును రిషభ్‌ పంత్‌ ఆదుకున్నాడు. చెన్నై బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ పరుగులు చేస్తున్నాడు. ఈ క్రమంలో పంత్‌ షూలేస్‌ ఊడిపోయాయి. క్రీజ్‌కు దగ్గరగా ఫీల్డింగ్‌ చేస్తున్న రైనా ఇది గమనించాడు. వెంటనే పంత్‌ వద్దకు వచ్చి షూ లేస్‌ కట్టాడు. అనంతరం పంత్ బ్యాటింగ్ కొనసాగించాడు. ఈ ఘటనతో రైనా క్రీడాస్ఫూర్తిని చాటాడు.

పంత్‌-రైనాల స్నేహం:

పంత్‌-రైనాల స్నేహం:

దీనికి సంబందించిన వీడియోను ఐపీఎల్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్లు పెడుతున్నారు. 'అప్పుడు అడ్డుకున్నా.. ఇప్పుడు షూలేస్‌ కట్టాడు', 'పంత్‌-రైనా మధ్య మంచి స్నేహం ఉంది' అని కామెంట్లు రాస్తున్నారు.

రైనాను అడ్డుకున్న పంత్‌:

రైనాను అడ్డుకున్న పంత్‌:

చెన్నై మొదటగా బ్యాటింగ్ చేయగా.. ఢిల్లీ బౌలర్ జగదీషా సుచిత్‌ ఓపెనర్ షేన్‌ వాట్సన్‌ను పెవిలియన్ పంపాడు. అనంతరం సురేశ్‌ రైనా మైదానంలోకి వచ్చాడు. ఇక క్రీజులోకి వెళుతుండగా.. పంత్‌ అడ్డుగా నిలబడ్డాడు. రైనా ఎటు కదిలితే.. పంత్ కూడా అటే కదులుతూ కొంత సమయం ఆటపట్టించాడు. చివరకు రైనా అతనిని తప్పించుకుని క్రీజ్‌లోకి వెళ్ళాడు. అనంతరం ఇద్దరు నవ్వులు పూయించారు.

Story first published: Saturday, May 11, 2019, 16:19 [IST]
Other articles published on May 11, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+