న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్.. సురేష్ రైనా 100

IPL 2019 : Suresh Raina 1st Fielder To Take 100 Catches In IPL || Oneindia Telugu
IPL 2019, CSK vs DC: Suresh Raina 1st fielder to take 100 catches in IPL

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మన్‌ సురేష్ రైనా అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. చెన్నైవేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రైనా అత్యంత వేగంగా 100 క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్‌గా రికార్డులోకి ఎక్కాడు. ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత అందుకున్న మొదటి ఫీల్డర్‌ రైనా మాత్రమే.

రైనా @ 100 క్యాచ్‌లు

ఢిల్లీ ఇన్నింగ్స్ మొదటి ఓవర్లో ఓపెనర్ పృద్వి షా క్యాచ్ పట్టడంతో రైనా ఖాతాలో 100వ క్యాచ్‌ చేరింది. రైనా తర్వాత బెంగళూరు ఆటగాడు డివిలియర్స్ 84 క్యాచ్‌లతో రెండవ స్థానంలో ఉన్నాడు. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ 82 క్యాచ్‌లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే వికెట్ కీపర్ జాబితాలో మాత్రం కలకత్తా కెప్టెన్ దినేష్ కార్తీక్ 100 క్యాచ్‌లు పట్టాడు.

రైనా @ 5000 పరుగులు

రైనా @ 5000 పరుగులు

మార్చి 23న చెపాక్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సురేశ్ రైనా ఐపీఎల్‌లో 5000 పరుగులు చేసిన మొదటి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్, రాబిన్ ఉతప్ప, గౌతమ్ గంభీర్, శిఖర్ ధావన్, క్రిస్‌గేల్, మహేంద్ర సింగ్ ధోనీలు ఐపీఎల్‌లో 4000 పరుగుల మార్క్‌ని అందుకున్న జాబితాలో ఉన్నారు.

గుజరాత్ లయన్స్ కెప్టెన్‌గా:

గుజరాత్ లయన్స్ కెప్టెన్‌గా:

ఐపీఎల్‌లో సురేష్ రైనా 10 సీజన్లు చెన్నై తరపున అడగా.. రెండు సీజన్లు గుజరాత్ లయన్స్ జట్టుకు (2016, 2017) ప్రాతినిధ్యం వహించాడు. నిషేధం కారణంగా చెన్నై రెండు సంవత్సరాలు ఐపీఎల్‌లో ఆడలేదు. ఈ రెండు సంవత్సరాలు గుజరాత్ లయన్స్ జట్టుకు రైనా కెప్టెన్‌గా ఉన్నాడు. నిషేధం అనంతరం రి ఎంట్రీ ఇచ్చిన చెన్నై జట్టులో మళ్లీ కలిసాడు. 2018లో రైనా 445 పరుగులతో చెన్నై కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

సీజన్-12లో విఫలం:

సీజన్-12లో విఫలం:

ఈ సీజన్-12లో రైనా 19, 30, 36, 16, 17, 14, 4, 58, 13, 0, 38, 2, 59 పరుగులు చేసాడు. కేవలం రెండు అర్ధ సెంచరీలు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశ పరిచాడు. అయితే బుధవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో అర్ధ సెంచరీ చేసి సత్తా చాటాడు. 37 బంతుల్లో 59 పరుగులతో చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Story first published: Thursday, May 2, 2019, 14:48 [IST]
Other articles published on May 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X