Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చెన్నై vs ఢిల్లీ: రైనాను అడ్డుకున్న పంత్‌ (వీడియో)

IPL 2019 : Rishabh Pant Stops Suresh Raina From Taking Strike ! || Oneindia Telugu
IPL 2019, CSK vs DC: Rishabh Pant Blocks Suresh Rainas Way

టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్‌ పంత్‌ మైదానంలో బ్యాటుతో ఎంతలా చెలరేగినా.. తన సరదా పనులతో సహచర ఆటగాళ్లను మాత్రం నవ్విస్తుంటాడు. తాజాగా పంత్‌ చేసిన ఓ సరదా పని నవ్వులు పూయిస్తుంది. బుధవారం రాత్రి చెన్నైలోని చెపాక్‌ వేదికగా దిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్‌లో ఓ సరదా సన్నివేశం జరిగింది.

రైనాను అడ్డుకున్న పంత్‌:

టాస్‌ ఓడి చెన్నై మొదటగా బ్యాటింగ్ చేయగా.. ఢిల్లీ బౌలర్ జగదీషా సుచిత్‌ ఓపెనర్ షేన్‌ వాట్సన్‌ను పెవిలియన్ పంపాడు. అనంతరం సురేశ్‌ రైనా మైదానంలోకి వచ్చాడు. ఇక క్రీజులోకి వెళుతుండగా.. పంత్‌ అడ్డుగా నిలబడ్డాడు. రైనా ఎటు కదిలితే.. పంత్ కూడా అటే కదులుతూ కొంత సమయం ఆటపట్టించాడు. చివరకు రైనా అతనిని తప్పించుకుని క్రీజ్‌లోకి వెళ్ళాడు. అనంతరం ఇద్దరు నవ్వులు పూయించారు. ఈ వీడియోను ఐపీఎల్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. ఇక ఆలస్యం ఎందుకు మీరూ చూడండి.

రైనా అర్ధ సెంచరీ:

రైనా అర్ధ సెంచరీ:

ఈ సీజన్-12లో రైనా 19, 30, 36, 16, 17, 14, 4, 58, 13, 0, 38, 2, 59 పరుగులు చేసాడు. కేవలం రెండు అర్ధ సెంచరీలు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశ పరిచాడు. అయితే బుధవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో అర్ధ సెంచరీ చేసి సత్తా చాటాడు. 37 బంతుల్లో 59 పరుగులతో చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్లే ఆఫ్ మ్యాచ్‌ల ముందు రైనా ఫామ్ లోకి రావడం చెన్నై జట్టుకు కలిసొచ్చే అంశం.

చెన్నై విజయం:

చెన్నై విజయం:

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 179 పరుగులు చేసింది. రైనా (37 బంతుల్లో 59; 8 ఫోర్లు, 1 సిక్స్‌), ధోనీ (22 బంతుల్లో 44 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్సర్లు)లు మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ 16.2 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌటైంది. ఇమ్రాన్‌ తాహిర్‌ నాలుగు.. జడేజా మూడు వికెట్లు తీశారు. ధోనీ ఒకే ఓవర్‌లో రెండు కళ్లు చెదిరే స్టంపింగ్‌లు చేసాడు. ధోనీకి 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు లభించింది.

Story first published: Thursday, May 2, 2019, 13:57 [IST]
Other articles published on May 2, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+