ఒక ఓవర్.. రెండు మెరుపు స్టంపింగ్‌లు

వికెట్ల వెనుక భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అత్యంత చురుకుగా ఉంటాడు. ముఖ్యంగా స్టంపింగ్‌లు చేయడంలో ధోనీకి సాటివచ్చే మొనగాడు దరిదాపుల్లో కూడా లేడు. అందుకే ధోనీని ప్రపంచ అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకడిగా పరిగణిస్తారు. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాహీ తన సత్తా ఏంటో మరోసారి చాటాడు. ధోనీ ఇద్దరు ఢిల్లీ బ్యాట్స్‌మన్‌లను కళ్లు చెదిరే స్టంపౌట్లు చేశాడు.

మోరిస్ స్టంపౌట్:
చెన్నై వేదికగా బుధవారం రాత్రి దిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ధోనీ ఒకే ఓవర్‌లో రెండు కళ్లు చెదిరే స్టంపింగ్‌లు చేసి ఔరా అనిపించాడు. 11వ ఓవర్ నాలుగో బంతిని చెన్నై స్పిన్నర్ రవీంద్ర జడేజా వేయగా.. డిల్లీ బ్యాట్స్‌మన్ క్రిస్ మోరిస్ కొద్దిగా ముందుకు వంగి షాట్ ఆడాడు. అయితే బంతి నేరుగా ధోనీ చేతుల్లోకి వెళ్లగా.. స్టంపౌట్ చేసి అప్పీల్ చేశాడు. మైదానంలో ఉన్న లెగ్ అంపైర్.. థర్డ్ అంపైర్‌ను సమీక్ష కోరాడు. రిప్లేలో మోరిస్ కాలు ఒక్క క్షణం గాల్లోకి లేవగా.. సరిగ్గా అదే సమయంలో ధోనీ బెయిల్స్‌ను లేపాడు. దీంతో మోరిస్‌పెవిలియన్ చేరాడు.

శ్రేయస్ స్టంపౌట్:
అదే ఓవర్‌లో ఆఖరి బంతికి శ్రేయస్ అయ్యర్ ఫ్రంట్ ఫుట్ షాట్ ఆడాడు. ధోనీ మళ్లీ స్టంపౌట్ చేసి అప్పీల్ చేశాడు. ఫీల్డ్ అంపైర్ మరలా అంపైర్ థర్డ్ అంపైర్ సమీక్ష కోరాడు. శ్రేయస్ కాలు కొన్ని సెకన్ల పాటు గాల్లో ఉండగానే ధోనీ బెల్స్‌ను నేలకూల్చాడు. అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. మోరిస్‌ను స్టంపౌట్ చేసేందుకు ధోనీకి పట్టిన సమయం కేవలం 0.12 సెకన్లు మాత్రమే. ఇక శ్రేయస్ అయ్యర్‌ను స్టంప్ చేసేందుకు 0.16 సెకన్లు పట్టింది. ఈ స్టంపౌట్‌లకు సంబందించిన వీడియోలను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ కథలో ఉంచింది. మీరూ ఓ లుక్కేయండి.

చెన్నై చెమక్:
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 179 పరుగులు చేసింది. రైనా (37 బంతుల్లో 59; 8 ఫోర్లు, 1 సిక్స్), ధోనీ(22 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు)లు చెలరేగారు. లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ 16.2 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌటైంది. ఇమ్రాన్ తాహిర్ నాలుగు.. జడేజా మూడు వికెట్లు తీశారు. ధోనీకి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications