Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చెపాక్‌లో CSK Vs DC: సీఎస్‌కే బ్యాటింగ్, డుప్లెసిస్‌కు 200వ టీ20 మ్యాచ్

IPL 2019: CSK Vs DC, LIVE Score: Delhi Capitals win the toss and elect to bowl first

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా బుధవారం చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు డుప్లెసిస్‌కు ఇది 200వ టీ20 మ్యాచ్ కావడం విశేషం.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ మ్యాచ్‌తో తుది జట్టులోకి తిరిగొచ్చిన ధోని మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. దీంతో పాటు చెన్నై మరో రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. మిషెల్ శాంట్నర్, మురళీ విజయ్‌ల స్థానంలో డుప్లెసిస్, జడేజాలు తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. మోరవైపు ఢిల్లీ కూడా రెండు మార్పులు చేసింది. ఇషాంత్ శర్మ, కగిసో రబాల స్థానంలో ట్రెంట్ బోల్ట్, సుచిత్‌లకు చోటు కల్పించింది.

ఈ సీజన్‌లో ఇప్పటికే ఈ రెండు జట్లు ప్లేఆఫ్ బెర్తుని ఖాయం చేసుకున్నాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నఈ రెండు జట్లు ఈ సీజన్‌లో తలపడటం ఇది రెండోసారి. చివరగా ఢిల్లీ వేదికగా ఈ రెండు జట్లు తలపడిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్లు తేడాతో విజయం సాధించింది.

1
45926

అయితే, గత రెండు, మూడు మ్యాచ్‌లుగా సీఎస్‌కే ఆటగాళ్లు ఆ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. సీఎస్‌కే చివరగా ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట ఓడిపోయింది. మరోవైపు శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ వరుస విజయాలను నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది.

అంతేకాదు ఏడేళ్లలో తొలిసారి ప్లేఆఫ్‌కు చేరింది. ఢిల్లీ విజయాల్లో ధావన్, రబాడ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లాడిన ఢిల్లీ క్యాపిటల్స్ 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరోవైపు చెన్నై కూడా 8 మ్యాచ్‌‌ల్లో విజయం సాధించినప్పటికీ రన్ రేట్ విషయంలో ఢిల్లీ కాస్త మెరుగ్గా ఉంది.

జట్ల వివరాలు
ఢిల్లీ క్యాపిటల్స్
పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), కొలిన్ ఇన్‌గ్రామ్, రూథర్‌ఫర్డ్‌, అక్షర పటేల్, అమిత్ మిశ్రా, కగిసో రబాడ, ఇషాంత్ శర్మ, సందీప్ లమిచానే

చెన్నై సూపర్ కింగ్స్
షేన్ వాట్సన్, డుప్లెసిస్, మురళీ విజయ్, అంబటి రాయుడు, సురేశ్ రైనా, కేదార్ జాదవ్, ధోని, జడేజా, బ్రావో, దీపక్ చాహర్, హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్

Story first published: Wednesday, May 1, 2019, 19:47 [IST]
Other articles published on May 1, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+