For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్: భారత బౌలర్‌ హర్భజన్‌ సింగ్‌ అరుదైన ఘనత

IPL 2019,Qualifier 2 : Harbhajan Singh Is The 4th Bowler To Take 150 IPL Wickets ! || Oneindia
IPL 2019: CSK vs DC: Harbhajan Singh achieves big milestone, becomes fourth bowler to take 150 IPL wickets

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్-12లో చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్‌ సింగ్‌ అరుదైన ఘనతను సొంత చేసుకున్నాడు. ఐపీఎల్‌లో 150 వికెట్లు తీసిన బౌలర్‌గా హర్భజన్‌ చరిత్ర సృష్టించాడు. విశాఖ వేదికగా శుక్రవారం రాత్రి క్వాలిఫైయర్‌-2లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్భజన్‌ సింగ్‌ 150వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఐపీఎల్‌లో 150 వికెట్ల క్లబ్‌లో హర్భజన్‌ చేరాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

హర్భజన్‌ సింగ్‌ @ 150:

16వ ఓవర్ ఐదో బంతికి ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌ రూథర్‌ఫర్డ్‌ను క్యాచ్ అవుట్ ద్వారా పెవిలియన్‌కు చేరడంతో హర్భజన్‌ ఖాతాలో 150వ ఐపీఎల్‌ వికెట్‌ చేరింది. ఐపీఎల్‌లో 150 వికెట్ల క్లబ్‌లో చేరిన నాలుగో బౌలర్‌ హర్భజన్‌. శ్రీలంక పేసర్ లసిత్ మలింగ (169).. భారత స్పిన్నర్లు అమిత్ మిశ్రా (156), పీయూష్ చావ్లా (150)ల తర్వాత ఐపీఎల్‌లో 150 వికెట్లు తీసిన బౌలర్‌గా హర్భజన్‌ రికార్డుల్లోకి ఎక్కాడు.

డ్వేన్‌ బ్రావో @ 147:

డ్వేన్‌ బ్రావో @ 147:

ఈ సీజన్‌లో హర్భజన్‌ 10 మ్యాచులు ఆడి 16 వికెట్లు తీశాడు. హర్భజన్‌ సింగ్‌తో పాటు మరో చెన్నై బౌలర్‌ డ్వేన్‌ బ్రావో (147 ) కూడా 150 వికెట్ల క్లబ్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నాడు. చెన్నై ఫైనల్‌ చేరుకోవడంతో ముంబైలో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో బ్రావో మూడు వికెట్లు తీస్తే.. ఈ క్లబ్‌లో చేరే అవకాశం ఉంది.

ధోనీకి కృతజ్ఞతలు:

ధోనీకి కృతజ్ఞతలు:

'ఇది పూర్తి భిన్నమైన ఫార్మాట్‌. ఈ ఫార్మాట్‌లో కూడా 150 వికెట్లు తీయడం సంతోషంగా ఉంది. ఎప్పటికప్పుడు నా బౌలింగ్‌ను మరింత మెరుగుపరుచుకుంటాను. ఈ సీజన్లో చాలా వికెట్లు తీశాను. పవర్‌ప్లేలో స్పిన్నర్‌ బౌలింగ్‌ చేయడం కష్టం. అయినా వికెట్లు తీయడం ఎంతో సంతృప్తినిచ్చింది. నాపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చిన ధోనీకి కృతజ్ఞతలు' అని హర్భజన్‌ తెలిపారు.

Story first published: Saturday, May 11, 2019, 15:01 [IST]
Other articles published on May 11, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+