న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తిరుమలకు రోహిత్‌ శర్మ.. విశాఖకు ధోనీ

IPL 2019,Qualifier 2: MS Dhoni Reached To Vizag, Rohith Sharma Visits Thirumala ! || Oneindia Telugu
IPL 2019: Cricketers Rohit Sharma & Dinesh Karthik Visits Tirumala

టీమిండియా స్టార్ ఓపెనర్, ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు రోహిత్‌ శర్మకు ఘన స్వాగతం పలికి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. రోహిత్‌ బుధవారమే తిరుమలకు చేరుకున్నారు. ఈ రాత్రికి అక్కడే బస చేసి గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు.

తిరుమలలో దినేష్‌ కార్తీక్‌:

తిరుమలలో దినేష్‌ కార్తీక్‌:

2017లో ముంబై ఇండియన్స్ ఐపీఎల్‌ కప్ గెలిచిన అనంతరం రోహిత్‌ శర్మ సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ సీజన్-12లో ముంబై ఫైనల్‌కు చేరింది. ఫైనల్‌కు నాలుగు రోజుల గ్యాప్ ఉండడంతో.. రోహిత్ వెంకన్న దగ్గరకు వెళ్లారు. టీమిండియా క్రికెటర్ దినేష్‌ కార్తీక్‌ కూడా తిరుమలకు వెళ్లారు. ఈ రోజు తెల్లవారుజామున ఆయన వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

విశాఖకు ధోనీ:

విశాఖకు ధోనీ:

ఈనెల 10న విశాఖపట్నంలోని వైఎస్ఆర్ స్టేడియంలో క్వాలిఫైయర్‌-2 మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు బుధవారం విశాఖకు చేరుకుంది. విశాఖ విమానాశ్రయంలో చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీకి అభిమానులు స్వాగతం పలికారు. ఇక జట్టు ఆటగాళ్లకు విశాఖ నిర్వాహకులు స్వాగతం పలికారు.

12న ఫైనల్‌ మ్యాచ్‌:

12న ఫైనల్‌ మ్యాచ్‌:

మంగళవారం జరిగిన తొలి క్వాలిఫైయర్‌ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఓడించి ముంబై ఇండియన్స్‌ ఫైనల్‌కు చేరింది. ఈ నెల 12న హైదరాబాద్‌లో ముంబై ఫైనల్‌ మ్యాచ్‌ ఆడనుంది. తొలి క్వాలిఫైయర్‌ మ్యాచ్‌లో చెన్నై ఓడినా.. మరో అవకాశం ఉంది. బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించి రెండో క్వాలిఫయర్‌కు అర్హత సాధించింది. శుక్రవారం చెన్నై, ఢిల్లీ జట్ల మధ్య క్వాలిఫైయర్‌-2 మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ముంబైతో ఫైనల్ ఆడుతుంది.

Story first published: Thursday, May 9, 2019, 9:17 [IST]
Other articles published on May 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X