ఐపీఎల్ 2019 దుబాయ్‌లో నిర్వహించాలని యోచిస్తోన్న బీసీసీఐ

హైదరాబాద్: వచ్చే ఏడాది జరగబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)ను దుబాయ్‌లో నిర్వహించే అవకాశాలున్నాయి. దేశంలో జరగబోయే 2019 సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఐపీఎల్ మ్యాచ్‌లకు భద్రత కల్పించడంపై సందేహాలు నెలకొన్నాయి. దీంతో 2019 ఐపీఎల్‌ను దుబాయ్‌కి తరలించాలనే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక 12వ సీజన్ ఐపీఎల్ మార్చి 29 నుంచి మే 19 మధ్య జరగనుంది.
సరిగ్గా ఇదే సమయంలో దేశంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణ కష్టంగా మారనుంది. ఐపీఎల్‌ను తరలించే పరిస్థితులు ఏర్పడితే దానికి తాము సిద్దంగా ఉన్నామని బీసీసీఐ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ఒకవేళ ఐపీఎల్ తరలించాల్సి వస్తే భారత ప్రజలు ఎక్కువగా ఉండే దుబాయ్‌కి తరలిస్తామన్నారు. ఇక గతంలో రెండు సార్లు ఐపీఎల్‌ను ఇతర దేశాల్లో నిర్వహించారు.
2009 సార్వత్రిక ఎన్నికలతో దక్షిణాఫ్రికాలో నిర్వహించగా.. 2014 ఎన్నికలతో యూఏఈలో నిర్వహించారు. ఇక యూఏఈలో దుబాయ్, అబుదాబి, షార్జాలతో మొత్తం మూడు వేదికలున్నాయి. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)కు సంబంధించి కొన్ని మ్యాచ్‌లను కూడా షార్జా, దుబాయ్ వేదికగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్వహించింది.
బీసీసీఐ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ఒకవేళ దక్షిణాఫ్రికా వేదికగా ఐపీఎల్ నిర్వహిస్తే భారత అభిమానులు ఆ వాతావరణ పరిస్థితులకు సరిపడదు. షార్జా, దుబాయ్, అబుదాబి వేదికలు అన్ని విధాలా అనుకూలంగా ఉంటాయి. గతంలోనూ ఐపీఎల్ వేదికను రెండు సార్లు బదిలీ చేశాం. 2009లో దక్షిణాఫ్రికాలో, 2014లో దుబాయ్‌లో నిర్వహించిన సంగతి గుర్తు చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications