ఐపీఎల్ 2019: భారత్‌లో నిర్వహించడం కష్టమే!, రేసులో మూడు దేశాలు

హైదరాబాద్: టీ20 క్రికెట్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ ఐపీఎల్ వల్ల పలు దేశాలు తమ ద్వైపాక్షిక సిరిస్‌లను సైతం మార్చుకునే పరిస్థితి తలెత్తింది. క్యాష్ రిచ్ లీగ్ టోర్నీగా పేరొందిన ఐపీఎల్ క్రికెట్ అభిమానులను గత కొన్ని సీజన్లుగా అలరిస్తోన్న సంగతి తెలిసిందే.
అయితే, వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఐపీఎల్ 2019 సీజన్‌ను భారత్ నుంచి తరలిపోనుందా? అంటే అవుననే సమాధానం వినవస్తోంది. సాధారణ ఎన్నికల షెడ్యూల్ ఇంకా ఖరారు కాని నేపథ్యంలో ఐపీఎల్ 2019ని ఎక్కడ నిర్వహించాలనే దానిపై బీసీసీఐ ఆలోచిస్తోంది.

ఎన్నికల షెడ్యూల్ విడుదలను బట్టి
2019 సాధారణ ఎన్నికల షెడ్యూల్‌ను ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు ప్రకటిస్తుందా? అని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఎదురుచూస్తోంది. ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన తేదీలు ఐపీఎల్‌కు అడ్డురాని పక్షంలో భారత్‌లోనే ఐపీఎల్‌ను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.

భద్రత కల్పించడం కష్టం కాబట్టి
ఎన్నికల దృష్ట్యా ఐపీఎల్ సీజన్‌కు భద్రత కల్పించడం కష్టం కాబట్టి బీసీసీఐ ఎన్నికల షెడ్యూల్ కోసం ఎదురుచూస్తోంది. గతంలో కూడా ఇలా రెండు సార్లు ఐపీఎల్‌ను వేరే దేశంలో నిర్వహించారు. 2009 ఎన్నికల సమయంలో ఐపీఎల్‌ను దక్షిణాఫ్రికాలో నిర్వహించగా, 2014 ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహించిన సంగతి తెలిసిందే.

రెండు దేశాలను పరిగణనలోకి
అయితే, ఈసారి బీసీసీఐ రెండు దేశాలను పరిగణనలోకి తీసుకుంది. ఆ రెండు దేశాలు మరోవే కాదు యూఏఈ. దక్షిణాఫ్రికా. ముంబై మిర్రర్‌లో వచ్చిన కథం ప్రకారం ఇంగ్లాండ్‌ను కూడా బీసీసీఐ ఎంచుకునే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. దీనిని బట్టి చూస్తే దక్షిణాఫ్రికాతో పోలిస్తే యూఏఈనే బీసీసీఐ రెండో ఛాయిస్‌గా కనిపిస్తోంది.

యూఏఈలో మూడు గ్రౌండ్లు
యూఏఈలో మూడు గ్రౌండ్లు ఉండటమే ఇందుకు కారణం. ఈ మూడు వేదికల్లో ఐపీఎల్‌ను నిర్వహించడం ద్వారా గ్యారంటీగా విజయవంతం అవుతుంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతే బీసీసీఐ దీనిపై కీలక ప్రకటన చేయనుంది. ఇప్పటికే యూఏఈ, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ బోర్డులతో ఐపీఎల్ 2019 సీజన్ గురించి బీసీసీఐ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications