వరల్డ్‌కప్ ఎఫెక్ట్!: ఐపీఎల్ మధ్యలోనే వీడుతున్న విదేశీ క్రికెటర్లు వీరే!

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్ ప్లేఆఫ్ దశకు చేరుకుంది. దీంతో ఏయే జట్లు ప్లేఆఫ్‌కు చేరుకంటాయోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు ఆసక్తికరంగా సాగిన ఈ సీజన్ ఇకపై కూడా అలా జరుగుతుందా? లేదా అనే ఆలోచనలో అభిమానులు పడ్డారు. అందుకు కారణం ప్లేఆఫ్ మ్యాచ్‌లకు ముందే విదేశీ క్రికెటర్లు తమ సొంత దేశాలకు పయనం కావడమే.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌లో ఇప్పటివరకు అభిమానులను అలరించిన విదేశీ క్రికెటర్లు పలువురు సొంత దేశాలకు పయనమవుతున్నారు. ఈ విషయాన్ని ఆయా ఐపీఎల్ ప్రాంఛైజీలు సైతం ధ్రువీకరించాయి.

8 విజయాలతో పాయింట్ల పట్టికలో చెన్నై అగ్రస్థానం
ఈ సీజన్‌లో 8 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే ప్లేఆఫ్‌కు తన బెర్తుని ఖాయం చేసుకుంది. ఇక, ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సేఫ్ పొజిషన్ చేరుకునేందుకు కొన్ని పాయింట్ల దూరంలో ఉన్నాయి. మిగతా ఆ రెండు స్థానాల కోసం ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు రేసులో ఉన్నాయి.

రాజస్థాన్, ఆర్సీబీకి కష్టమే
రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఏదైనా మిరాకిల్ జరిగితేనే తప్పు ఆ రెండూ టాప్-4లో చోటు దక్కించుకోవడం కష్టం. వరల్డ్‌కప్ నేపథ్యంలో విదేశీ ఆటగాళ్లు ఆయా ఫ్రాంఛైజీలకు దూరం కావడం కొన్ని జట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. ఇంగ్లాండ్ ప్లేయర్లు ఇప్పటికే పయనం కాగా... ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా క్రికెటర్లు బుధవారం లేదా గురువారం త్వరలోనే సొంత దేశాలకు పయనం కానున్నారు.

న్యూజిలాండ్, ఆప్ఘనిస్థాన్ క్రికెటర్లు మాత్రం అందుబాటులో
న్యూజిలాండ్, ఆప్ఘనిస్థాన్ క్రికెటర్లు మాత్రం ఈ పూర్తి సీజన్‌కు అందుబాటులో ఉండనున్నారు. మరోవైపు వెస్టిండిస్ ఆటగాళ్లపై స్పష్టత లేదు. విండిస్ బోర్డు ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన ఏదీ చేయలేదు. దీంతో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనున్న మే12 వరకు వారు అందుబాటులో ఉంటారా? లేదా అన్నది తెలియాల్సి ఉంది.

వెస్టిండిస్ క్రికెటర్లపై లేని స్పష్టత
ఐపీఎల్‌ను ఎక్కువగా ప్రభావితం చేసే ఆటగాళ్లలో వెస్టిండిస్ క్రికెటర్లు కీలకపాత్ర వహిస్తారు. దీంతో ఇప్పుడు వీరంతా టోర్నీ మధ్యలోనే సొంత దేశాలకు పయనమైతే అభిమానులు టీ20 మజాను కోల్పోతారని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. వరల్డ్ కప్ కోసం జట్టుని వెస్టిండిస్ బోర్డు ఏప్రిల్ 24న ప్రకటించనుంది.

ఐపీఎల్‌లో తర్వాతి మ్యాచ్‌లకు అందుబాటులో ఉండని విదేశీ క్రికెటర్లు వీరే:
చెన్నై సూపర్ కింగ్స్ - డుప్లెసిస్, ఇమ్రాన్ తాహిర్
ఢిల్లీ క్యాపిటల్స్ - కగిసో రబాడ
ముంబై ఇండియన్స్ - జాసన్ బెహ్రాన్‌డార్ఫ్, క్వింటన్ డీకాక్
సన్‌రైజర్స్ హైదరాబాద్ - డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో, షకీబ్ ఉల్ హాసన్
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ - డేవిడ్ మిల్లర్
కోల్‌కతా నైట్‌రైడర్స్ - జోయి డేన్లే
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - డేల్ స్టెయిన్, మొయిన్ అలీ, మార్కస్ స్టోయినిస్
రాజస్థాన్ రాయల్స్- జోస్ బట్లర్, స్టీవ్ స్మిత్, బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications