ముగిసిన ఐపీఎల్ 2019 వేలం: జట్ల వారీగా ఆటగాళ్ల వివరాలివే

IPL 2019: Complete squads & players bought at IPL Auction for CSK, RCB, MI, KKR, SRH, RR, KXIP and DC teams

హైదరాబాద్: ఐపీఎల్‌ 12వ సీజన్‌ కోసం వేలం ముగిసింది. ప్రాంఛైజీలు యువ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపించాయి. మొత్తం 1003 మంది ప్లేయర్లు ఈ వేలానికి రిజిస్ట్రేషన్ చేసుకోగా, ప్రాంఛైజీల సూచన మేరకు 351 మంది తుది జాబితాకు ఎంపిక చేశారు. ఇందులో 228 మంది భారత ఆటగాళ్లున్నారు.

ఐపీఎల్ పుణ్యమా! అని 15 ఏళ్లకే కోటీశ్వరుడైన ప్రయాస్ రే బర్మన్‌

70 మంది క్రికెటర్లను ఎంపిక చేసుకునేందుకు 8 ఫ్రాంచైజీలు పోటీపడగా 60 మందిని కొనుగోలు చేశాయి. ఇందులో 40 మంది భారత్ నుంచి కాగా 20 విదేశీ ఆటగాళ్లున్నారు. వీళ్ల కోసం అన్ని ఫ్రాంచైజీలు కలిపి రూ. 106.8 కోట్లు ఖర్చు చేశాయి. ఈసారి వేలంలో యువీ లాంటి ఆటగాడు అతి కష్టం మీద అమ్ముడుపోగా.. వరుణ్ చక్రవర్తి అనే తమిళనాడు స్పిన్నర్‌ను పంజాబ్ రూ.8.4 కోట్లకు కొనుగోలు చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

గత సీజన్లో జయదేవ్ ఉనద్కత్‌ను రూ.11.50 కోట్లకు కొనుగోలు చేసిన రాజస్థాన్ ఈసారి కూడా అతడిని రూ.8.40 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక, పేసర్ మోహిత్ శర్మను చెన్నై సూపర్ కింగ్స్ రూ.5 కోట్లకు దక్కించుకుంది. ఈ వేలంలో చెన్నై ఇద్దరిని, హైదరాబాద్ ముగ్గుర్ని మాత్రమే కొనుగోలు చేశాయి.

ఈ ఐపీఎల్ వేలం తర్వాత జట్ల వారీగా ఆటగాళ్ల వివరాలు మీకోసం...

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు

అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు: మహేంద్ర సింగ్ ధోనీ, సురేశ్ రైనా, దీపక్ చాహర్, కేఎం ఆసిఫ్, కరణ్ శర్మ, ధ్రువ్ షోరే, డుప్లెసిస్, మురళీ విజయ్, రవీంద్ర జడేజా, సామ్ బిల్లింగ్స్, మిచెల్ శాంట్నర్, డేవిడ్ విల్లే, డ్వేన్ బ్రావో, షేన్ వాట్సన్, లుంగి ఎంగిడీ, ఇమ్రాన్ తాహిర్, కేదార్ జాదవ్, అంబటి రాయుడు, హర్భజన్ సింగ్, ఎన్ జగదీషన్, శార్దుల్ ఠాకూర్, మోను కుమార్, చైతన్య బిష్ణోయ్

వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: మోహిత్ శర్మ (రూ.5 కోట్లు), రుతురాజ్ గైక్వాడ్‌ (రూ.20 లక్షలు)

సన్ రైజర్స్ హైదరాబాద్

అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు: భువనేశ్వర్ కుమార్, డేవిడ్ వార్నర్, విలియ్సమన్, రషీద్ ఖాన్, షకీబ్ అల్ హసన్, మనీష్ పాండే దీపక్ హుడా, సిద్దార్థ్ కౌల్, శ్రీవాస్తవ్ గోస్వామి (కీపర్), ఖలీల్ అహ్మద్, యూసుఫ్ పఠాన్, బసిల్ థంపి, నటరాజన్, రికీ భుయ్, సందీప్ శర్మ, మహ్మద్ నబీ, బిల్లీ స్టాన్లేక్, విజయ్ శంకర్, షహబాజ్ ఖాన్, అభిషేక్ శర్మ‌,

వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: జానీ బెయిర్ స్టో (రూ.2.2 కోట్లు), వృద్ధిమాన్ సాహా (రూ.1.2 కోట్లు), మార్టిన్ గప్టిల్ (రూ.1 కోటి)

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు: విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, పార్థీవ్ పటేల్, యజువేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, పవన్ నేగి, నాథన్ కౌల్టర్ నైల్, మొయన్ అలీ, మహ్మద్ సిరాజ్, కాలిన్ డి గ్రాండ్‌హోమ్, టిమ్ సౌథీ, ఉమేష్ యాదవ్, నవదీప్ సైనీ, కుల్వంత్ ఖేజ్రోలియా, మార్కస్ స్టోయినిస్,

వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: గురు కీరత్ సింగ్‌ (రూ.50 లక్షలు), షిమ్రాన్ హెట్మెయర్‌ (రూ.4.2 కోట్లు), దేవ్‌దత్ పడిక్కల్‌ (రూ.20 లక్షలు), శివమ్ దూబే (రూ.5 కోట్లు), హెన్రిక్ క్లాసేన్ (రూ.50 లక్షలు), హిమ్మత్ సింగ్‌ (రూ.65 లక్షలు), మిలింద్ కుమార్‌ (రూ.30 లక్షలు), ప్రయాస్ రాయ్ బర్మన్‌ (రూ.1.50 కోట్లు), అక్షదీప్ నాథ్‌(రూ.3.6 కోట్లు)

ముంబై ఇండియన్స్

అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్య, జస్ప్రీత్ బుమ్రా, కృనాల్ పాండ్య, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, మయాంక్ మార్కండే, రాహుల్ చాహర్, అనుకుల్ రాయ్, సిద్ధార్థ్ లాడ్, ఆదిత్య టారే, క్వింటన్ డికాక్, ఎవిన్ లూయిస్, కీరన్ పోలార్డ్, బెన్ కటింగ్, మిచ్ మెక్‌క్లెనాగన్, ఆడమ్ మిల్నే, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్,

వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: లసిత్ మలింగ (రూ.2 కోట్లు), అన్మోల్‌ప్రీత్ సింగ్‌ (రూ.80 లక్షలు), బరీందర్ శ్రాన్‌ (రూ.3.40 కోట్లు), పంకజ్ జైస్వాల్‌ (రూ.20 లక్షలు), రిసిక్ దార్‌ (రూ.20 లక్షలు), యువరాజ్ సింగ్ (రూ.1 కోటి).

కోల్‌కతా నైట్ రైడర్స్

అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు: దినేశ్ కార్తీక్, రాబిన్ ఉతప్ప, క్రిస్ లిన్, ఆండ్రే రస్సెల్, సునీల్ నరైన్, శుభ్‌మన్ గిల్, పియూష్ చావ్లా, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ, శివమ్ మావి, నితీష్ రాణా, రింకు సింగ్, కమలేష్ నాగర్‌కోటి,

వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: కార్లోస్ బ్రాత్‌వైట్‌ (రూ.5.2 కోట్లు), ల్యాకీ ఫెర్గ్యుసన్‌ (రూ.1.6 కోట్లు), అన్రిక్ నోర్జే (రూ.20 లక్షలు), నిఖిల్ నాయక్‌ (రూ.20 లక్షలు), హార్రీ గుర్నే (రూ.75 లక్షలు), పృథ్వీ రాజ్ యర్రా (రూ.20 లక్షలు), జోయ్ డెన్లీ (రూ.1 కోటి), శ్రీకాంత్ ముదే (రూ.20 లక్షలు)

రాజస్థాన్ రాయల్స్

అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు: అజింక్య రహానే, కృష్ణప్ప గౌతమ్, సంజూ శాంసన్, శ్రేయస్ గోపాల్, ఆర్యమన్ బిర్లా, ఎస్.మిథున్, ప్రశాంత్ చోప్రా, స్టువర్ట్ బిన్నీ, రాహుల్ త్రిపాఠి, బెన్ స్టోక్స్, స్టీవ్ స్మిత్, జాస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్, ఇష్ సోధీ, ధావళ్ కులకర్ణి, మహిపాల్ లోమ్రార్.

వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: జయదేవ్ ఉనద్కత్ (రూ.8.2 కోట్లు), వరుణ్ ఆరోన్‌ (రూ.2.4 కోట్లు), ఒషానే థామస్‌ (రూ.1.10 కోట్లు), శశాంక్ సింగ్‌ (రూ.30 లక్షలు), లియామ్ లివింగ్‌స్టోన్‌ (రూ.50 లక్షలు), శుభ్‌మన్ రంజానే (రూ.20 లక్షలు), మనన్ వోహ్రా (రూ.20 లక్షలు), ఆస్టన్ టర్నర్‌ (రూ.50 లక్షలు), రియాన్ పరాగ్‌ (రూ.20 లక్షలు)

ఢిల్లీ క్యాపిటల్స్

అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు: శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, పృథ్వీ షా, అమిత్ మిశ్రా, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, రాహుల్ తెవాతియా, జయంత్ యాదవ్, మన్జోత్ కల్రా, కాలిన్ మున్రో, క్రిస్ మోరిస్, కగిసో రబాడ, సందీప్ లామిచానే, ట్రెంట్ బౌల్ట్,

వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: హనుమ విహారీ (రూ. 2 కోట్లు), అక్షర్ పటేల్ (రూ. 5 కోట్లు), ఇషాంత్ శర్మ (రూ.1.1 కోట్లు), అంకుశ్ బెయిన్స్‌ (రూ.20 లక్షలు), నాథూ సింగ్‌ (రూ.20 లక్షలు), కాలిన్ ఇన్‌గ్రామ్ (రూ.6.4 కోట్లు), షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్‌ (రూ.1.6 కోట్లు), కీమో పాల్‌ (రూ.50 లక్షలు), జలజ్ సక్సేనా (రూ.20 లక్షలు), బండారు అయ్యప్ప (రూ.20 లక్షలు).

కింగ్స్ ఎలెవన్ పంజాబ్

అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు: కేఎల్ రాహుల్, క్రిస్ గేల్, ఆండ్రూ టై, మయాంక్ అగర్వాల్, అంకిత్ రాజ్‌పుత్, ముజీబ్ ఉర్ రహ్మాన్, కరుణ్ నాయర్, డేవిడ్ మిల్లర్, రవిచంద్రన్ అశ్విన్, మన్‌దీప్ సింగ్

వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: మార్కస్ హెన్రిక్యూస్‌ (రూ.1 కోటి), నికోలస్ పూరాన్‌ (రూ.4.2 కోట్లు), మహ్మద్ షమీ (రూ.4.8 కోట్లు), సర్ఫరాజ్ ఖాన్‌ (రూ.25 లక్షలు), వరుణ్ చక్రవర్తి (రూ.8.40 కోట్లు), సామ్ కర్రాన్‌ (రూ.7.20 కోట్లు), హర్డస్ విల్జోయెన్‌ (రూ.75 లక్షలు), అర్షదీప్ సింగ్‌ (రూ.20 లక్షలు), దర్శన్ నాల్కండే (రూ.30 లక్షలు), ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌ (రూ.4.8 కోట్లు), అగ్నివేశ్ అయాచీ (రూ. 20 లక్షలు), హర్‌ప్రీత్ బ్రార్‌ (రూ. 20 లక్షలు), మురుగన్ అశ్విన్‌ (రూ. 20 లక్షలు).

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    Story first published: Wednesday, December 19, 2018, 12:54 [IST]
    Other articles published on Dec 19, 2018
    POLLS

    Get breaking news alerts from myKhel

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more