న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2019: అరుదైన రికార్డుకి 6 పరుగుల దూరంలో క్రిసే గేల్

IPL 2019 : Chris Gayle 6 Runs Away From Joining In 4000 Runs Club In IPL
IPL 2019: Chris Gayle six runs away from joining Suresh Raina, Virat Kohli, MS Dhoni in elite list

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2019 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విధ్వంసక ఓపెనర్ క్రిస్‌గేల్ మరో అరుదైన రికార్డుకి చేరువయ్యాడు. టోర్నీలో భాగంగా సోమవారం రాత్రి 8 గంటలకు రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో క్రిస్‌గేల్ మరో ఆరు పరుగులు చేస్తే ఐపీఎల్‌లో 4000 పరుగుల మార్క్‌ని అందుకున్న 9వ క్రికెటర్‌గా రికార్డు సృష్టించనున్నాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఇంగ్లాండ్‌తో ముగిసిన వన్డే సిరిస్‌తో ఫామ్‌లోకి

ఇంగ్లాండ్‌తో ముగిసిన వన్డే సిరిస్‌తో ఫామ్‌లోకి

ఇప్పటి వరకూ సురేశ్ రైనా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్, రాబిన్ ఉతప్ప, గౌతమ్ గంభీర్, శిఖర్ ధావన్, మహేంద్ర సింగ్ ధోనిలు మాత్రమే ఐపీఎల్‌లో 4000 పరుగులు పూర్తి చేశారు. కాగా, గత సీజన్‌లో నిరాశపరిచిన క్రిసే గేల్... ఇటీవలే ఇంగ్లాండ్‌తో ముగిసిన వన్డే సిరిస్‌తో ఫామ్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే.

క్రిస్‌గేల్ 106 సగటుతో ఏకంగా 424 పరుగులు

క్రిస్‌గేల్ 106 సగటుతో ఏకంగా 424 పరుగులు

ఇంగ్లాండ్‌తో ఫిబ్రవరిలో ముగిసిన వన్డే సిరీస్‌లో 4 మ్యాచ్‌లాడిన క్రిస్‌గేల్ 106 సగటుతో ఏకంగా 424 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే, మార్చి 23న చెపాక్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఆటాగాడు సురేశ్ రైనా ఐపీఎల్‌లో 5000 పరుగులు చేసిన మొదటి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్‌లో క్రిస్ గేల్ మెరుగైన రికార్డు

ఐపీఎల్‌లో క్రిస్ గేల్ మెరుగైన రికార్డు

కాగా, ఐపీఎల్‌లోనూ క్రిస్‌గేల్‌కి మెరుగైన రికార్డు ఉంది. ఇప్పటి వరకూ 112 మ్యాచ్‌లాడిన క్రిస్ గేల్ 41.17 సగటుతో 3,994 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు ఉండగా.. 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు:

అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు: కేఎల్ రాహుల్, క్రిస్ గేల్, ఆండ్రూ టై, మయాంక్ అగర్వాల్, అంకిత్ రాజ్‌పుత్, ముజీబ్ ఉర్ రహ్మాన్, కరుణ్ నాయర్, డేవిడ్ మిల్లర్, రవిచంద్రన్ అశ్విన్, మన్‌దీప్ సింగ్

వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: మార్కస్ హెన్రిక్యూస్‌ (రూ.1 కోటి), నికోలస్ పూరాన్‌ (రూ.4.2 కోట్లు), మహ్మద్ షమీ (రూ.4.8 కోట్లు), సర్ఫరాజ్ ఖాన్‌ (రూ.25 లక్షలు), వరుణ్ చక్రవర్తి (రూ.8.40 కోట్లు), సామ్ కర్రాన్‌ (రూ.7.20 కోట్లు), హర్డస్ విల్జోయెన్‌ (రూ.75 లక్షలు), అర్షదీప్ సింగ్‌ (రూ.20 లక్షలు), దర్శన్ నాల్కండే (రూ.30 లక్షలు), ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌ (రూ.4.8 కోట్లు), అగ్నివేశ్ అయాచీ (రూ. 20 లక్షలు), హర్‌ప్రీత్ బ్రార్‌ (రూ. 20 లక్షలు), మురుగన్ అశ్విన్‌ (రూ. 20 లక్షలు).

Story first published: Monday, March 25, 2019, 18:44 [IST]
Other articles published on Mar 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X