క్రిస్‌గేల్‌తో సామ్ కరన్! అప్పుడు.. ఇప్పుడు

చిన్నప్పుడు తన అభిమాన క్రికెటర్‌తో ఫొటో దిగాలని ప్రతిఒక్కరూ కలలు కంటారు. ఒకవేళ అభిమాన క్రికెటర్ కంటబడితే.. ఫొటో దిగాల్సిందే. ఇదే ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ చేసాడు. తన అభిమాన క్రికెటర్ క్రిస్ గేల్‌తో కొన్నేళ్ల క్రితం ఫొటో దిగాడు. అంతేకాదు దాన్ని ఎంతో పదిలంగా దాచుకున్నాడు కూడా.
పిచ్చి అభిమానంతో ఫొటో:
కరన్ పాఠశాలకు వెళ్లే వయసులో స్కూల్ యూనిఫాంలో ఉన్నప్పుడు గేల్‌పై పిచ్చి అభిమానంతో ఫొటో దిగాడు. తాజాగా ఐపీఎల్‌లో పంజాబ్‌కు ఆడుతుండగా.. గేల్‌తో మరోసారి కరన్ ఫొటో దిగాడు. అయితే ఈ రెండు ఫొటోలను జత చేసి... గేల్.సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. 'ఇది ఏ యువ క్రికెటర్‌కైనా ప్రత్యేకమైదే. మీరు ఏం సాధించారు.. ఈ రోజు ఎక్కడున్నారు..? అనే విషయం చెప్పగలను. ఈ ఫొటోలో నేను యువకుడిలా ఉన్నాను.. కానీ నాకంటే ఇంకో యువకుడు ఉన్నాడు' అని గేల్ కామెంట్ పెట్టాడు.
ఫొటో చాలా బాగుంది:
ఇంకేముంది గేల్ పోస్ట్ చేసిన కొద్దీ క్షణాల్లోనే ఆ ఫొటో వైరల్ అయింది. క్రికెట్ అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్లు పెడుతున్నారు. అప్పుడు.. ఇప్పుడు కరన్ అందంగా ఉన్నాడని కామెంట్ చేస్తున్నారు. వెస్టిండీస్ వెటరన్ క్రికెటర్ బ్రియన్ లారా కూడా ఈ ఫొటోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు. 'ఫొటో చాలా బాగుంది. మ్యాచ్ చాలా బాగా ఆడావ్ సామ్ కరన్. మరో మంచి ప్రదర్శనతో రా' అని కామెంట్ పెట్టాడు.

వేలంలో రూ.7.2కోట్లు:
2019 ఐపీఎల్ వేలంలో కరన్‌ను కింగ్స్ ఎవెవన్ పంజాబ్ రూ.7.2కోట్లు వెచ్చించి కొనుక్కుంది. దిల్లీ క్యాపిట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్ గాయపడడంతో.. అతని స్థానంలో కరన్ జట్టులోకి వచ్చాడు. 167 పరుగుల లక్ష్యఛేదనలో 144/3 స్కోరుతో గెలుపుపై ధీమాగా ఉన్న ఢిల్లీని కరాన్ హ్యాట్రిక్‌తో ఓడించాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని పంజాబ్‌కు ఊహించని విజయాన్ని కట్టబెట్టాడు. దీంతో ఒక్కసారిగా ఈ యువ ఆల్‌రౌండర్ స్టార్ అయ్యాడు. ఈ సీజన్-12లో ఇప్పటివరకు కరన్ పేరు మారుమోగుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications