For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సిక్సులు ఎలా కొట్టాలో గేల్‌ను చూసే నేర్చుకున్నా: రసెల్‌

IPL 2019 : Chris Gayle’s Advice About Bats Helped Change My Game Says Russell || Oneindia Telugu
IPL 2019: Chris Gayles Advice Of Using Bigger Bats Has Helped Me says Andre Russell

బంతిని బలంగా బాది బౌండరీకి ఎలా పంపించాలో, సిక్సులు ఎలా కొట్టాలో వెస్టిండీస్ స్టార్ ఓపెనర్ క్రిస్ గేల్‌ను చూసే నేర్చుకున్నా అని విండీస్ హార్డ్‌ హిట్టర్‌ ఆండ్రీ రసెల్‌ తెలిపారు. రసెల్‌ ఈ ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతూ విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఓడిపోతామనుకున్న మ్యాచ్‌లను సైతం తన పవర్ హిట్టింగ్ తో గెలిపించి హీరో అయ్యాడు.

ఇప్పటివరకు సీజన్‌-12లో రసెల్‌ 10 మ్యాచ్‌లు ఆడి.. 65.33 సగటుతో 392 పరుగులు చేశాడు. 217 స్ట్రైక్‌రేట్‌తో ఉంది. ఇది ప్రస్తుత సీజన్‌లో అత్యుత్తమం. రసెల్‌ ఇప్పటికే 41 సిక్సర్లు బాదాడు. అయితే తాజాగా.. ఇంత అలవోకగా సిక్సులు ఎలా కొడుతున్నావు అనే ప్రశ్నకు రసెల్‌ సమాధానం ఇచ్చాడు.

'క్రిస్ గేల్‌ సలహా నా జీవితాన్ని మార్చింది, అతని నుంచి చాలా నేర్చుకున్నా. సిక్సులు ఎలా కొట్టాలో గేల్‌ను చూసే నేర్చుకున్నా. ఇంతకు ముందు తేలికైన బ్యాట్లు వాడేవాడిని. 2016 టీ20 ప్రపంచకప్‌ సమయంలో గేల్‌ నా దగ్గరికి వచ్చి.. నువ్వు బరువైన బ్యాటు వాడు. నీకు అది సరిగ్గా సరిపోతుంది. ఆ బ్యాటుతో సిక్సర్లు సులభంగా కొట్టవచ్చు అని సలహా ఇచ్చాడు. ఆ సలహాతో ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో 48 (43 బంతుల్లో) పరుగులు చేశాను. ప్రస్తుతం మిగితా బ్యాట్స్‌మెన్ బ్యాట్ల కంటే నా బ్యాట్‌ బరువు ఎక్కువ. నా బ్యాటులో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. వాటితోనే నేను చాలా బాగా బ్యాటింగ్‌ చేస్తున్నా' అని రసెల్‌ చెప్పుకొచ్చారు.

Story first published: Wednesday, April 24, 2019, 17:14 [IST]
Other articles published on Apr 24, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+