

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న క్రిస్ గేల్ మరో ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా క్రిస్ గేల్ రికార్డు సృష్టించాడు. శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్ ఈ ఘనతను అందుకున్నాడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఐపీఎల్‌లో 300 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా క్రిస్ గేల్ రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం గేల్ 302 ఐపీఎల్ సిక్సర్లతో ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇప్పటివరకూ గేల్ కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల తరపున ఆడాడు. ఇలా మొత్తం 114 ఇన్నింగ్స్‌ల్లో 300 సిక్సులు కొట్టాడు.
గేల్ 37 ఇన్నింగ్స్‌ల్లో మొదటి 100 సిక్సులు, 69 ఇన్నింగ్స్‌ల్లో 200 సిక్సులు, 114 ఇన్నింగ్స్‌ల్లో 300 సిక్సులు బాదాడు. మొత్తం 300 సిక్సులు కొట్టేందుకు గాను క్రిస్ గేల్ 2719 బంతులు ఎదుర్కొన్నాడు. క్రిస్ గేల్ తర్వాత ఈ జాబితాలో ఏబీ డివిలియర్స్(192 సిక్పర్లు), ధోని(187 సిక్సర్లు), సురేశ్ రైనా(186)లు ఉన్నారు.
Chris Gayle's journey to 300 IPL sixes
100: 37 innings (943 balls) in 2012
200: 69 innings (1811 balls) in 2015
300: 114 innings (2719 balls) in 2019