ఐపీఎల్: వేగంగా 4వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా గేల్ రికార్డు


హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓపెనర్ క్రిస్‌గేల్ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో సోమవారం జరుగుతున్న మ్యాచ్‌లో క్రిస్ గేల్ అత్యంత వేగంగా 4000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. క్రిస్‌గేల్ 112 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత అందుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో ఆరు పరుగులు చేయడం ద్వారా క్రిస్‌గేల్.. ఐపీఎల్‌లో 4000 పరుగుల మార్క్‌ని అందుకున్న 9వ క్రికెటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. అదేవిధంగా ఐపీఎల్‌లో నాలుగు వేల పరుగులు సాధించిన రెండో విదేశీ ఆటగాడిగా గేల్ రికార్డు సాధించాడు. గతంలో డేవిడ్ వార్నర్ ఈ ఘనతను అందుకున్నాడు. ఇక ఈ జాబితాలో డేవిడ్ వార్నర్(114), విరాట్ కోహ్లి(128), సురేష్ రైనా, గంభీర్(140)లు తర్వాత స్థానాల్లో ఉన్నారు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఇంగ్లాండ్‌తో ముగిసిన వన్డే సిరిస్‌తో ఫామ్‌లోకి
ఇప్పటి వరకూ సురేశ్ రైనా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్, రాబిన్ ఉతప్ప, గౌతమ్ గంభీర్, శిఖర్ ధావన్, మహేంద్ర సింగ్ ధోనిలు మాత్రమే ఐపీఎల్‌లో 4000 పరుగులు పూర్తి చేశారు. కాగా, గత సీజన్‌లో నిరాశపరిచిన క్రిసే గేల్... ఇటీవలే ఇంగ్లాండ్‌తో ముగిసిన వన్డే సిరిస్‌తో ఫామ్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే.
క్రిస్‌గేల్ 106 సగటుతో ఏకంగా 424 పరుగులు
ఇంగ్లాండ్‌తో ఫిబ్రవరిలో ముగిసిన వన్డే సిరీస్‌లో 4 మ్యాచ్‌లాడిన క్రిస్‌గేల్ 106 సగటుతో ఏకంగా 424 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే, మార్చి 23న చెపాక్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఆటాగాడు సురేశ్ రైనా ఐపీఎల్‌లో 5000 పరుగులు చేసిన మొదటి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్‌లో క్రిస్ గేల్ మెరుగైన రికార్డు
కాగా, ఐపీఎల్‌లోనూ క్రిస్‌గేల్‌కి మెరుగైన రికార్డు ఉంది. ఇప్పటి వరకూ 112 మ్యాచ్‌లాడిన క్రిస్ గేల్ 41.17 సగటుతో 3,994 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు ఉండగా.. 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications