For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2019: ఆర్సీబీ సాంబార్ ట్వీట్‌కు చెన్నై దిమ్మదిరిగే రిప్లై

IPL 2019 : CSK's Epic Response To RCB On South India Derby | Oneindia Telugu
IPL 2019: Chennai Super Kings epic response to Royal Challengers Bangalore on South India derby

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2019 సీజన్ షెడ్యూల్‌ని బీసీసీఐ మంగళవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. కేవలం 17 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను మాత్రమే బీసీసీఐ ప్రకటించింది. ఐపీఎల్ 2019 సీజన్‌ మొదటి మ్యాచ్‌లో ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్, కోహ్లీ సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడనుంది.

మార్చి 23న టోర్నీ ప్రారంభం

మార్చి 23న టోర్నీ ప్రారంభం కానుంధి. ఈ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ చేసిన ఓ ట్వీట్‌కి చెన్నై సూపర్ కింగ్స్ తనదైన శైలిలో రిప్లై ఇచ్చింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తన ట్విట్టర్‌లో "దక్షిణ భారత్‌లో స్పైసీ వంటకాలు ఫేమస్‌.. కానీ, మాకు తియ్యని సాంబార్ అంటే ఇష్టం" అని ట్వీట్ చేసింది.

చెన్నై సూపర్ రిప్లై

దీనికి రిప్లైగా చెన్నై సూపర్ కింగ్స్ తన ట్విట్టర్‌లో "కానీ సాంబార్ ఎప్పుడైన పసుపు రంగులో ఉంటుంది" అని ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. మరోవైపు ఈ ట్వీట్లపై అభిమానులు సైతం సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

తొలి రెండు వారాల షెడ్యూల్‌ను మాత్రమే

కాగా, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తొలి రెండు వారాల షెడ్యూల్‌ను మాత్రం బోర్డు విడుదల చేయడం విశేషం. ఈ రెండు వారాల్లో మొత్తం 17 మ్యాచ్‌లు జరగనున్నాయి. మిగతా షెడ్యూల్‌ను లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ తర్వాత విడుదల చేసే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉంటే స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌న తొలి మ్యాచ్‌ను మార్చి 24న కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో ఆడ‌నుంది. నగరంలోని ఉప్ప‌ల్ స్టేడియంలో మార్చి 29న రాజ‌స్థాన్‌ vs స‌న్‌రైజ‌ర్స్ మ్యాచ్‌తో ఈ సీజ‌న్‌లో తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

14 రోజుల షెడ్యూల్‌లో మొత్తం 17 మ్యాచ్‌లు

14 రోజుల షెడ్యూల్‌లో మొత్తం 17 మ్యాచ్‌లు

తాజాగా విడుదలైన 14 రోజుల షెడ్యూల్‌లో మొత్తం 17 మ్యాచ్‌లు జరగనున్నాయి. టోర్నీలోని ఎనిమిది జట్లూ నాలుగేసి మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఇందులో రెండు మ్యాచ్‌లు సొంతగడ్డపై మిగిలిన రెండు ప్రత్యర్థి మైదానంలో ఆడనున్నాయి. కాగా బెంగళూరు, ఢిల్లీ జట్లు మాత్రం ఐదేసి మ్యాచ్‌‌లు ఆడనుండగా సొంతగడ్డపైనే మూడు మ్యాచ్‌లు ఆడేలా షెడ్యూల్‌‌ని విడుదల చేశారు.

Story first published: Wednesday, February 20, 2019, 18:15 [IST]
Other articles published on Feb 20, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+