For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చెన్నై వీధుల్లో షేన్‌ వాట్సన్‌ చక్కర్లు

IPL 2019: Channai Super Kings Palyer Shane Watson auto ride in chennai streets with his Family

ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ బ్యాట్స్‌మన్‌ షేన్‌ వాట్సన్‌ తన ఫ్యామిలీతో కలిసి చెన్నై నగరం చుట్టేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ఐపీఎల్ కారణంగా క్రికెటర్లు తమ ఫ్యామిలీతో కలిసి సరదా సమయం గడపలేకపోయారు. ఐపీఎల్‌ పూర్తవడంతో ఆటగాళ్లకు విరామం దొరికింది. ఈ విరామంను వారు వినియోగించుకుంటున్నారు.


ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

ముఖ్యంగా షేన్ వాట్సన్‌ తన కుటుంబంతో సహా ఆటోలో చెన్నై మొత్తం చక్కర్లు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంత ఎండలో కూడా దొరికిన సమయాన్ని కుటుంబంతో జాలీగా గడుపుతున్నాడు. రోడ్డుపై వెళుతున్నప్పుడు అభిమానులను కూడా పలకరించాడు వాట్సన్. ఆటోలో వాట్సన్‌ను చూసి చెన్నై అభిమానులు ఫొటోలు తీసేందుకు ఎగబట్టారు. దీనికి సంబందించిన ఓ ఫొటో నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. అభిమానులు ఆ ఫొటోను తెగ షేర్ చేస్తున్నారు.

ఆదివారం రాత్రి ఉప్పల్ వేదికగా జరిగిన ఐపీఎల్‌-12 ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌.. ముంబయి ఇండియన్స్‌ చేతిలో ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. ఆఖరి బంతి వరకూ ఈ మ్యాచ్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. ఆ మ్యాచ్‌లో చెన్నై ఓడినా.. షేన్‌ వాట్సన్‌ చేసిన పోరాటం అందరినీ ఆకట్టుకుంది. జట్టును గెలిపించడానికి రక్తం కారుతున్నా కూడా ఎవరికీ చెప్పకుండా వాట్సన్‌ బ్యాటింగ్‌ కొనసాగించాడు. దీంతో వాట్సన్‌ అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.

Story first published: Wednesday, May 15, 2019, 17:40 [IST]
Other articles published on May 15, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+