ముంబై సంబరాలు షురూ: ఓపెన్ టాప్ బస్‌లో ముంబై వీధుల్లో పరేడ్

హైదరాబాద్: అభిమానులతో కలిసి విక్టరీ పరేడ్‌కు ముంబై ఇండియన్స్ సిద్దమైంది. ఆదివారం ఉప్పల్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ ఫైనల్లో ముంబై ఇండియన్స్ ఒక పరుగు తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ నాలుగోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో చెన్నైసూపర్ కింగ్స్ విజయానికి 9 పరుగులు అవసరమైన దశలో పేసర్ లసిత్ మలింగ కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి ముంబై ఇండియన్స్‌ను గెలిపించాడు. ఐపీఎల్ చరిత్రలో నాలుగు సార్లు ఛాంపియన్‌గా అవతరించిన ముంబై సోమవారం అభిమానులతో కలిసి సంబురాలు చేసుకోనుంది.
ఓపెన్ టాప్ బస్‌లో పరేడ్
ఇందులో భాగంగా ఐపీఎల్ ట్రోఫీతో ముంబై ఇండియన్స్ జట్టు ఓపెన్ టాప్ బస్‌లో పరేడ్ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ పరేడ్ సోమవారం సాయంత్రం 6.30 గంటలకు ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీ ఇల్లు ఆంటెల్లా నుంచి ప్రారంభమై టీమ్ బస చేసే హోటల్ వరకు సాగనుంది. ఈ పరేడ్‌లో ముంబై ఇండియన్స్ అభిమానులు పాల్గొనాలని సూచించింది.
ట్విట్టర్‌లో ట్వీట్
ఈ మేరకు ముంబై ఇండియన్స్ తన అధికారిక ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తమ మొదటి ఆరు గేముల్లో నాలుగింట మాత్రమే విజయం సాధించింది. ఆ తర్వాత ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఐదింట విజయం సాధించిన ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది.

20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసిన ముంబై
కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. అనంతరం ముంబై నిర్దేశించిన 150 పరుగుల లక్ష్య చేధనలో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 148 పరుగులకే పరిమితమైంది.
ఆఖరి ఓవర్‌లో చెన్నై విజయానికి 9 పరుగులు
చెన్నై జట్టులో షేన్ వాట్సన్(80) చివరివరకు పోరాడాడు. ఆఖరి ఓవర్‌లో చెన్నై విజయానికి 9 పరుగులు అవసరమయ్యాయి. ఈ తరుణంలో అనూహ్యంగా పుంజుకొన్న ముంబై బౌలర్లు వాట్సన్‌ను రనౌట్ చేయడంతో తిరిగి పోటీలోకొచ్చింది. ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరమైన దశలో ఇరు జట్ల శిబిరాల్లోనూ ఉత్కంఠ నెలకొంది.
నాలుగు టైటిళ్లను నెగ్గిన జట్టుగా ముంబై
దీంతో అందరూ సూపర్ ఓవర్ ఖాయమేనని అనుకున్నారు. అయితే, చివరి బంతికి శార్దూల్ ఠాకూర్ వికెట్ తీసి మలింగ మ్యాచ్‌ను ముంబైవైపు తిప్పాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఐపీఎల్ చరిత్రలో నాలుగు టైటిళ్లను నెగ్గిన జట్టుగా ముంబై అరుదైన ఘనత సాధించింది. ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌కి మొత్తం 32,405 మంది ప్రేక్షకులు హాజరయ్యారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications