ఐపీఎల్ వేలం 2019: వీరంతా కనీస ధరకు అమ్ముడు పోతారా?

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2019 సీజన్ కోసం వేలానికి సమయం ఆసన్నమైంది. రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం డిసెంబర్ 18న జైపూర్ వేదికగా వేలం నిర్వహించనున్నారు. ఈ వేలానికి మొత్తం 1003 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొనేందుకు తమ పేర్లను రిజస్టర్ చేసుకున్నారు.
వేలానికి సంబంధించి 346 మంది క్రికెటర్ల పేర్లతో బీసీసీఐ జాబితా విడుదల చేసింది. ప్రాంఛైజీలన్నీ తమ జట్లను పటిష్టం చేసుకొనేందుకు ఎదురు చూస్తున్నాయి. వేలానికి ముందే పలువురి ఆటగాళ్లను ప్రాంఛైజీలు విడుదల చేశాయి. వారంతా ఇప్పుడు అదృష్టం పరీక్షించుకోనున్నారు.
అయితే, బీసీసీఐ విడుదల చేసిన జాబితాలో రూ.2 కోట్ల కనీస ధరలో భారత క్రికెటర్లెవరూ లేకపోవడం గమనార్హం. ఈ మొత్తంలో ఉన్న 9 మంది ప్లేయర్లు (బ్రెండన్ మెకల్లమ్, వోక్స్, లసిత్ మలింగ, షాన్ మార్ష్, కొలిన్ ఇంగ్రామ్, కోరె అండర్సన్, మాథ్యూస్, శ్యామ్ కరన్, డార్సీ షార్ట్) విదేశీయులే.
ఒకే రోజుతో ముగిసిపోయే ఐపీఎల్ వేలంలో గరిష్టంగా 70 మంది ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం ఉంది. వేలంలో ఉన్న పలువురు ఆటగాళ్లను ప్రాంఛైజీలు కనీస ధరకు కూడా కొనుగోలు చేయకపోవచ్చు. అలాంటి వారెవరో ఒక్కసారి చూద్దామా....

బ్రెండన్ మెక్‌కల్లమ్
ఐపీఎల్ తొలి సీజన్‌లో సెంచరీతో అందరిని ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ 2019 సీజన్‌లో రూ.2 కోట్ల కనీస ధరలో ఉన్నాడు. అయితే, గత కొన్నాళ్లుగా మెక్‌కల్లమ్ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. దీంతో రాబోయే వేలంలో బ్రెండన్ మెక్‌కల్లమ్‌ను కనీసధరతో పోలిస్తే తక్కువ ధర పలుకుతాడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

యువరాజ్ సింగ్
ఐపీఎల్ 2019 వేలం టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు కీలకం కానుంది. గతేడాదిన్నర కాలంగా జాతీయ జట్టుకు దూరమైన యువీ తనను తాను నిరూపించుకోవాలంటే ఏదో ఒక ప్రాంఛైజీ అతడిని కొనుగోలు చేయాల్సిందే. ఈ ఐపీఎల్‌లో యువీ మెరుపులు మెరుపించకుంటే క్రికెట్ కెరీర్ ప్రమాదంలో పడినట్లే. ఈ ఐపీఎల్‌లో తనను ఏదో ఒక ప్రాంఛైజీ కొనుగోలు చేయాలనే భావనతో ధర సైతం రూ.2 కోట్ల నుంచి కోటికి తగ్గించుకున్నాడు. ఫిట్‌నెస్ పెంచుకున్నాడు.

ఏంజెలో మాథ్యూస్
శ్రీలంకకు చెందిన ఈ సీనియర్ ఆటగాడు ఐపీఎల్‌లో ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఐపీఎల్ 2019 వేలంలో ఏంజెలో మాథ్యూస్ రూ.2 కోట్ల కనీస ధరలో ఉన్నాడు. ఆ ధరకు ఏంజెలో మాథ్యూస్‌ను ఏ ప్రాంఛైజీ అయినా కొనుగోలు చేస్తుందో లేదో చూడాలి మరి.

లసిత్ మలింగ
గతేడాది జరిగిన ఐపీఎల్ వేలంలో లసిత్ మలింగను ఎవరూ తీసుకోకపోవడంతో ముంబై ఇండియన్స్ ప్రాంఛైజీ బౌలింగ్ కోచ్‌గా నియమించింది. మంగళవారం జైపూర్ వేదికగా జరిగే వేలంలో మలింగను ఏ ప్రాంఛైజీ కూడా కొనుగోలు చేయకపోతే ఇదే అతడి చివరి ఐపీఎల్ వేలం అవుతుంది. కనీస ధర రూ.2 కోట్లుగా ఉంది.

శామ్ కర్రన్
ఈ ఏడాది ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా ఆశలను అడియాసలు చేసింది ఇతడే. ఆల్‌రౌండర్ అయిన శామ్ కర్రన్ అటు బ్యాటుతోనూ ఇటు బంతితో రాణిస్తాడు. కనీస ధర రూ.2 కోట్లు.

ఇషాంత్ శర్మ
గతేడాది జరిగిన ఐపీఎల్ వేలంలో కూడా ఇషాంత్ శర్మను ఏ ప్రాంఛైజీ కొనుగోలు చేయలేదు. ఈ సారైనా ఎవరైనా కరుణిస్తారేమో చూడాలి. మంగళవారం జైపూర్ వేదికగా జరిగే వేలంలో ఇషాంత్ శర్మ కనీస ధర రూ.75 లక్షలుగా ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications